అల్పాహారంతో మెదడుకు మేత..


Wed,December 16, 2015 12:10 AM

snake


బ్రేక్‌ఫాస్ట్ మానేసేవాళ్లు చాలామందే ఉంటారు గాని ఇది పిల్లలకు మరింత ముఖ్యమైనది. పిల్లలు, కౌమారంలో ఉన్నవాళ్లు ఇంకా పెరిగేదశలో ఉంటారు. వీరి పెరుగుదల చక్కగా ఉండాలంటే ఉదయం పూట తీసుకునే అల్పాహారం అత్యవసరం. అది కూడా మంచి పోషక పదార్థాలు కలిగి ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. టీనేజ్‌లో ఉన్న పిల్లల్లో బరువు, ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం కీలకమైనది. పిల్లలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఇదే పునాది.

మెదడు చురుగ్గా ఉండాలంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలితో స్కూల్‌కి వెళ్లే పిల్లలు చదువుపై ధ్యాస పెట్టలేరు. మనం అవసరమైనంత ఆహారం తీసుకోకపోతే అది మన ఆలోచనా సామర్థ్యం పైన ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా పిల్లల మెదడు చురుకుదనానికి పెట్టే పరీక్షల్లో ఉదయంపూట అల్పాహారం తీసుకోని పిల్లలు ఎక్కువ తప్పులు చేయగా, అలవాటుగా అల్పాహారం తీసుకునేవాళ్లు అందులో బాగా రాణించారు. పిల్లల ఆలోచనాశక్తి, గ్రహణశక్తి లాంటివి పెరగాలంటే అల్పాహారం తప్పనిసరి.

1799
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles