అష్టాదశ వర్షాత్కన్య పుత్రవత్పాలితామయ
ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహే నపాలయ

వధువు తండ్రి, కన్యాదాన సమయంలో వరునితో పలికే మాటలివి. ఓ వరుడా! 18 సంవత్సరాల వయసుగల ఈ కన్యను కుమారునితో సమానంగా పెంచుకొన్నాను. నా ప్రాణసమానమైన ఈమెను నీకు దానంగా ఇస్తున్నాను. నువ్వు కూడా అలాగే, స్నేహపూర్వకంగా, ప్రేమాభిమానాలతో ఏలుకోవలసింది అని వరుని శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి అతని కాళ్లు కడిగి అర్ఘ్యమిచ్చి కన్యాదానం చేస్తాడు. అలా, లక్ష్మీదేవి స్వరూపురాలైన వధువు ఆ వరునికి భార్యగా మారుతుంది.