అరుపు ఆలోచింపజేస్తున్నది!


Sat,September 1, 2018 11:12 PM

తల మీద చెయ్యి వేసి దీవించె గురువులు. నడుం మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగ నేను తీసాను పరుగులు. చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు ఇది కవిత్వం కాదు. పద్యం అంతకన్నా కాదు. అరుపు అనే పాటలోని నాలుగు లైన్లు. ఆ పాట గురించి, దానికి సంబంధించిన వివరాలు..
roll-rida
రోల్ రైడా, కమ్రాన్‌లు కలిసి రూపొందించిన అరుపు పాట సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టి చూపించారు. సాహిత్యం, సంగీతం రెండూ ఆలోచింపజేస్తున్నాయి. వరకట్న వేధింపులు, యాసిడ్ దాడులు, అత్యాచార యత్నాల వంటి ప్రధాన అంశాలతో పాటు చిన్న చిన్న సంఘటనలు చెప్తూ ఈ పాటను చిత్రీకరించారు. యూట్యూబ్‌లో కూడా ఈ పాటను పదహారు లక్షలకు పైగా చూశారు. ఒక్కో సన్నివేశంలో నిగూఢ అర్థ్ధాన్ని ఈ పాట ద్వారా చెప్పాలనుకున్నారు. ఆ విషయంలో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. కమ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హరికాంత్ గునమగరి దర్శకత్వం వహించారు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు.


చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటావని అంటూ రోల్ రైడా గొంతుతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ప్రముఖ పాటల రచయిత కృష్ణకాంత్ రాసిన ఈ పాటను మనీషా కూడా పాడింది. మేల్ వెర్షన్ రోల్ రైడా పాడాడు. ర్యాప్‌కు సంబంధించిన లిరిక్స్ రోల్ రైడానే రాసుకున్నాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి పాట ద్వారా చెప్పడం పట్ల నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ పాటను విన్న వాళ్లు ఇప్పటికీ అమ్మాయిల పరిస్థితి ఇలానే ఉంది అని బాధపడే కన్నా.. వాళ్లను గౌరవించడం మొదలుపెట్టడం మంచిది. ఇలాంటి మార్పు రావడం కోసమే ఈ ప్రయత్నం చేశామని అంటున్నారు.

971
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles