అరటి నారు పోగేసి.. సేంద్రియ చీరకు ప్రాణం పోసి..


Fri,March 1, 2019 01:40 AM

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చాలా వరకూ ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాముఖ్యం పెరుగుతున్నది. మరి అలాంటప్పుడు కట్టుకునే బట్టలు కూడా సేంద్రియ పద్ధతిలో ఎందుకు తయారు చేయకూడదు? అలాగే చేశారు చెన్నయ్‌కి చెందిన మహిళలు..
sarees
అనకపుతూర్ అనేది చెన్నయ్ విమానాశ్రయానికి శివారులో ఉన్న గ్రామం. పదిహేనేండ్ల క్రితం ఆ గ్రామంలో ఉన్న మూడు తరాల చేనేత కార్మికులు వృత్తికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో చేనేత కార్మికుల ఆసోషియేషన్ అధ్యక్షులు శేఖర్ ఇలా చెప్పుకొచ్చారు.. 1970 నుంచి ఈ గ్రామంలో జూట్, నూలు వడకటం ప్రధాన వృత్తి. ఇక్కడ ఉత్పత్తి చేసిన బట్టలను, దారాలను నైజీరియా దేశానికి ఎగుమతి చేసేవారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల మూలంగా ఆఫ్రికాకు తమ దిగుమతులను నిలిపివేసింది. అందులో ఈ నేత కార్మికుల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. దీంతో వీళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. వృత్తి కోల్పోయిన మహిళలు ఎవరి ఇంటి దారి వాళ్లు పట్టారు. వీళ్లందరికీ మళ్లీ శేఖర్ ఉపాధి కల్పించాలనుకున్నారు. వెంటనే వినూత్న రీతిలో ఆలోచించాడు. తక్కువ పెట్టుబడితో పరిశ్రమ మొదటుపెట్టి, మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించాడు. అరటి చెట్ల నుంచి నూలు పోగులు తీయొచ్చని తెలుసుకున్నాడు. దాన్నే ఉపాధి మార్గంగా ఎన్నుకున్నాడు. మహిళందరినీ భాగస్వాములను చేసి క్లస్టర్లను ఏర్పాటు చేశాడు. అరటి చెట్ల నుంచి పోగులు తీసి, సహజమైన రంగులతో నూలు ఉత్పత్తి చేస్తున్నారు. ఆ నూలుతోనే చీరలు తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. పసుపు, నీలి మందు వంటి రంగులను ఉపయోగించి చీరలకు రంగులు అద్దుతున్నారు. సుమారు 5 వేల మంది మహిళలు ఈ క్లస్టర్లలో ఉపాధి పొందుతున్నారు. 25 రకాల నారలతో చీరెలు తయారు చేయడంలో ఈ మహిళలు నిమగ్నమయ్యారు. ఒక్కో చీర ధర 1800 నుంచి 7000 వరకూ ఉంటుందని శేఖర్ చెప్పాడు. దీంతో పాటు సేంద్రియ పద్ధతిలో చీరలు తయారు చేస్తున్నందుకు శేఖర్ లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. అలాగే శేఖర్ చేస్తున్న ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించాలని, రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు.

341
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles