అమ్మాయిలు.. సోషల్‌మీడియా నేస్తాలు


Tue,January 22, 2019 10:40 PM

సోషల్‌మీడియా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్నది. రకరకాల ఫీచర్లు, యాప్స్ రావడంతో అమ్మాయిలే తొందరగా దీనికి కనెక్ట్ అవుతున్నారని చెప్తున్నాయి అధ్యయనాలు.
Social-Friends
సోషల్‌మీడియా ప్రభావంపై తాజాగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ అధ్యయనం నిర్వహించింది. దీంట్లో భాగంగా 14-20 సంవత్సరాల వయసున్న యువతను పరిశీలించారు. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రమ్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటున్న యువతలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నట్లు వారు గుర్తించారు. బ్యూటీ, డ్రెస్, జ్యువెలరీ గురించి అప్‌డేట్స్ తెలుసుకోవడంతో పాటు వాటిని స్నేహితులతో పంచుకునేందుకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారట అమ్మాయిలు. రోజులో అబ్బాయిలు 1-3 గంటలు కేటాయిస్తే.. అమ్మాయిలు మాత్రం 2-5 గంటల సమయం సోషల్‌మీడియా కోసం కేటాయిస్తున్నారని వారు తెలిపారు. కానీ చాలామంది అమ్మాయిలు ప్రతిరోజూ దీనికి సమయం కేటాయించడం వల్ల ఆనందాన్ని కోల్పోతున్నట్లు వివరించారు.

422
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles