అభివందనం..అభినందనం


Sat,March 2, 2019 12:04 AM

రెండు విజాతి ధృవాలు. ఒకటే లక్ష్యం.. కొడుకు ప్రాణాలకు తెగించి యుధ్దరంగంలో ఉంటాడు.. యుద్ధంలో గాయపడ్డ పౌరులను గుర్తించి ఈమె ప్రాణం పోస్తుంది. రెండూ ముఖ్యమే..కొడుకు యుద్ధంలో గెలవాలని కోరుకోవడమూ ముఖ్యమే.క్షతగాత్రుల్ని రక్షించడమూ ముఖ్యమే. ఒకటి బాధ.. ఒకటి బాధ్యత ఇండియా, పాకిస్తాన్, ఇరాక్, ఇజ్రాయెల్ తేడా చూపని విశ్వమానవురాలు. అందుకే ఆ డాక్టరమ్మకు అందరూ పిల్లలే.. వింగ్ కమాండర్ అభినందన్ తల్లే ఈ మమతల తల్లి..
AbhinandanVarthamane
వైద్యురాలిగా ఎందరికో ఆవిడ ఓ అమ్మ.. తన చేతులతో ఎంతో మందికి ప్రాణం పోసిన మాతృమూర్తి.. ఆమెకు అభినందన్ ఎంత ముఖ్యమో, అభినందన్ లాంటి మనుషులూ అంతే ముఖ్యం. దేశమూ అంతే ముఖ్యమే.. ఇప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గుండెనిబ్బరం చేసుకుని ఉంది. అభినందన్ ధైర్య సాహసాల మీద నమ్మకముంచి పాకిస్తాన్ నుంచి తిరిగొస్తాడని ప్రగాఢంగా విశ్వసించింది.

వింగ్ కమాండర్ అభినందన్‌ది మూడు తరాలుగా ఎయిర్‌ఫోర్స్‌కి అంకితమైన కుటుంబం. ఆయన తండ్రి కార్గిల్ యుద్ధంలో ఫైటర్ జెట్ పైలెట్‌గా సేవలందించారు. భార్య తన్వీ కూడా ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. అభినందన్ తాత కూడా ఎయిర్‌ఫోర్స్‌లో పని చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జెట్ పైలెట్‌గా బాధ్యతలు పూర్తి చేశారు. ఇది అభినందన్ కుటుంబ వారసత్వం. మరి తల్లి! అభినందన్ తల్లి పేరు శోభ. వైద్యురాలు. భర్త ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగం కావటంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. యుద్ధ ప్రాంతాల్లో పౌరులకు, మహిళలకు, చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేది. ఎక్కడ ఈమె అవసరం ఉంటుందో అక్కడకు ధైర్యంగా వెళ్లేది.

మద్రాస్ వైద్య కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు శోభ. ఇంగ్లాండులోని రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్‌లో అనస్తీషియాలో పీజీ పట్టా పొందారు. అనంతరం ఆమె ప్రపంచ వ్యాప్తంగా వైద్య సేవలందించారు. ఇలా డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్‌లో సభ్యురాలయ్యారు. యుద్ధ మేఘాలు కమ్ముకుని, బాంబుల వర్షం కురిసిన ఎన్నో ప్రాంతాల్లో ఈమె వైద్యురాలిగా సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం ఇరాక్ ప్రాంతంలో, 2005 ఐవరీ కోస్ట్ తిరుగుబాటులో, లైబీరియా అంతర్యుద్ధంలో, నైజీరియా ఘర్షణల్లో బాధితులకు వైద్యం చేశారు. ఇరాక్ సూసైడ్ బాంబు బ్లాస్టుల సవాళ్లనూ ఎదుర్కొన్నారు. అలాంటి యుద్ధ వాతావరణంలో మహిళలను, చిన్నపిల్లలను, వృద్ధులను తన పిల్లల్లా కాపాడగలిగారు. ఇరాన్‌లో బాధితులు త్వరగా కోలుకోవడానికి ప్రాణాయామాన్ని బోధించారు. అక్కడి నుంచి ఆమె న్యూజినియాకు పయనమయ్యారు. అక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా అసాధారణ సేవలు చేశారు. లైంగిక హింస, సుఖవ్యాధులు, తెగల మధ్య ఘర్షణలపై అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేశారు.
shoba1
అక్కడి నుంచి లావోస్‌కు వెళ్లారు. రవాణ సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లోనూ వేల కిలోమీటర్లు తిరిగారు. అక్కడ సమస్యల్లో ఉన్న గర్భిణులకు వైద్య పరీక్షలందించారు. ప్రసవాలు చేసేవారు. ప్రత్యేక ఆస్పత్రిని నిర్వహించారు.మరోవైపు శోభ పైలెట్ భార్యగా కీలకమైన ఆపరేషన్లలో పాల్గొనాల్సి వచ్చేది. ఇలా పైలెట్‌కు భార్యగా, వైద్యురాలిగా, అభినందన్ తల్లిగానే కాకుండా మనసున్న వైద్యురాలిగా దేశసేవకు పాటుపడుతున్నారు. సేవా వారసత్వం కలిగిన కుటుంబంలో పుట్టిన అభినందన్‌ను కూడా దేశసేవకే అంకితం చేయాలని చిన్నప్పుడే నిర్ణయించారు తల్లిదండ్రులు. అందుకే వర్థమాన్‌ను ధైర్యం, సేవాభావంతో పెంచారు. సైనిక విద్యలు నేర్పించారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌ను చేశారు ఈ తల్లిదండ్రులు. అభినందన్‌ను చూసి యావత్ భారత్ ఎంత గర్వపడుతుందో అంతకన్నా ఎక్కువ గర్వపడుతున్నది. ఈ సైనిక కుటుంబం.
tanvi
భాగస్వామిదీ అదే బాట అభినందన్ తల్లిదండ్రులది మాత్రమే ఎయిర్‌ఫోర్స్ కుటుంబం కాదు. ఆయన భార్య తన్వీ మార్వా కూడా ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా విధులు నిర్వహించింది. చెన్నై ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వహించి కిందటి ఏడాది రిటైర్ అయ్యారు. ఆమె తన 15 సంవత్సరాల పాటు ఏఐఎఫ్‌లో సేవలందించారు. సైనిక్ పాఠశాలలో విద్యను అభ్యసించిన తన్వీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్‌లో అర్మ్‌డ్ ఫోర్స్ ఎగ్జ్‌క్యూటీవ్ కోర్స్‌ను పూర్తి చేశారు.

510
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles