అభాగ్యుల కోసం పరీక్ష!


Thu,March 14, 2019 12:18 AM

జీవితం ఒక పరీక్ష. అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకున్నప్పుడే ఏదోటి జరుగుతుంది. అపారమైన ప్రతిభ ఉన్నా.. పేదరికం అడ్డొస్తుంది. సాధించాలన్న తపన ఉన్నా.. వైకల్యం అడ్డం పడుతుంటుంది. అలాంటి వారి కలలు సాకారం చేసేందుకు ఓ మహిళ కష్టపడుతున్నది. వాళ్ల గోసలు తీర్చడానికి ఆమె పరీక్షలు రాస్తున్నది.
puspa
ఈమె పేరు ఎన్‌ఎం. పుష్ప ప్రియ.. బెంగళూర్‌లో ఉంటుంది. తన బాల్యం పేదరికంలో గడిచింది. తండ్రి అనారోగ్యానికి గురై మరణించాడు. తల్లి కేవలం నెలకు ఐదు వందలు సంపాదించేది. ఈ పరిస్థితిలో ఆమె ఏడో తరగతి పూర్తి చేయాలి. మరోవైపు సోదరుడు కూడా చదువుకుంటున్నాడు. అయినా కష్టాలకు ఓర్చింది. ఆర్థిక సాయం అందుకొని పై చదువులు చదివింది. కంప్యూటర్స్‌లో డిప్లొమా చేసింది. ఇప్పుడు పుష్ప, తన సోదరుడు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో అంగవైకల్యం ఉన్న ఓ వ్యక్తి తనకు పరీక్ష రాయడంలో సాయం చేయాలని కోరాడు. అతని దీనస్థితి చూసి చలించిపోయింది పుష్పప్రియ. ఒక్కసారిగా తన గతం పలకరించినట్లు భావించింది. అతనికి పరీక్ష రాయడంలో సాయం చేసింది. తర్వాత ఆమె ఆలోచనలు ఇలాంటి విద్యార్థుల మీదకు మళ్లాయి. అందరికీ తనకు చేతనైన సాయం చేయాలనుకుంది. సోదరుని సాయంతో పనిలోకి దిగింది. ఇటు ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే అంగవైకల్యం, అంధత్వం, పక్షవాతం, వినికిడి లోపం ఉన్న వారికి పరీక్షలు రాసిపెడుతున్నది. ఇప్పటి వరకు ఈమె 681 పరీక్షలు రాసింది. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ఆఫీస్‌లో అనుమతి తీసుకొని వెళ్లి పరీక్షలు రాసి వస్తుంది. ఆమె దయగల సేవలను గుర్తించిన ప్రభుత్వం నారీ శక్తి అవార్డుతో సత్కరించింది.

380
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles