అబ్బాయిలూ.. అన్నీ చెయ్యాల్సిందే!


Sun,April 14, 2019 01:06 AM

ప్రపంచవ్యాప్తంగా నానాటికీ లింగ వివక్ష పెరిగిపోతున్నది. ఇంటి పనులు, వంట పనులు ఆడవాళ్లే చెయ్యాలి అనే ఆలోచన ఎన్ని తరాలైనా అంతరించడం లేదు. అందుకే స్పెయిన్ దేశం వినూత్నంగా ఆలోచించింది. ఎక్కడో ఓ పాఠశాలలో మొదలైన కొత్త పద్ధతిని.. ఆ దేశం మొత్తం అమలు చేస్తున్నది. ఆ వినూత్న పద్ధతేంటో తెలుసా?
SPAIN-SCHOOL
ఏ దేశంలో అయినా.. ఇంటి పనులు, వంట పనులు ఎక్కువగా మహిళలే చేస్తుంటారు. వీరికి ఉద్యోగ బాధ్యతలు అదనం. ఈ పద్ధతి మారాలని.. సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఓ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. స్పెయిన్ దేశం విగోలోని కొలేజియా మాంటెకాస్ట్ పాఠశాల ఉపాధ్యాయుల ఆలోచన లింగ సమానత్వానికి తొలిమెట్టుగా నిలిచింది. తమ పాఠశాలలో ఇంటి పనులు, వంట పనులు ఎలా చెయ్యాలనే అంశంపై ప్రత్యేకంగా ఓ సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు గృహ అర్థశాస్త్రం. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు అనే భేదం లేకుండా అంతా ఇంటి పని, వంటపని నేర్చుకోవాల్సిందే. ఈ పాఠ్యాంశంలో భాగంగా.. బట్టలు ఉతకడం, వంట చేయడం, ఇంటిని శుభ్రపర్చడం, ఇంట్లోని వస్తువులను సర్దడం, బట్టలు ఇస్త్రీ చేయడం వంటి పనులు బోధిస్తున్నారు.

మొదట్లో ఈ పనులపై చాలా విమర్శలు వచ్చాయి. కొన్నాళ్లకు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడ్డారు. వారే స్వచ్ఛందంగా పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో కలిసి తమ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అంతా లింగ సమానత్వాన్ని కోరుకోవడంతో విమర్శలు చేసిన వారే అభినందనలు తెలుపుతున్నారు. ఈ కోర్సు వల్ల పిల్లలు ఇంటి పనుల్లో భాగమవుతున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు మెరుగ్గా ఉండడంతో ఈ కొత్త కోర్సును అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నది స్పెయిన్ దేశం.

332
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles