అప్పట్లో కథ.. ఇప్పట్లో సినిమా!


Sat,December 31, 2016 01:47 AM

సాగర్ కే చంద్ర.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.ఇష్టమైన సినిమాల కోసం ఉద్యోగం వదులుకున్నాడు. అయ్యారే సినిమాతో అదరహో అనిపించాడు. అప్పట్లో ఒకడుండేవాడుతో మళ్లీ మీ ముందుకొస్తున్నాడు.ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు జిందగీతో పంచుకున్నాడు.

కంగ్రాట్స్ మీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది?


SHEK
ముందు నుంచి నాకు నమ్మకం ఉంది. ట్రైలర్ చూసిన వాళ్లకు అర్థమయింది. అది ఉంది. ఇది ఉంది అని చెప్పను. సినిమా చూసిన ప్రేక్షకులే చెప్తారు.

ఇది ఎలాంటి జోనర్ సినిమా అనుకోవచ్చు?


ఇది ఒక కల్పిత వ్యక్తి ఆటో బయోగ్రఫీ.1992 నుంచి 1996 మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని కథ రాసుకున్నా. ముఖ్యంగా తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వించదగిన స్థాయికి ఎదిగిన పీవీ నర్సింహారావు ప్రస్తావన వస్తుంది. రైల్వే రాజు అనే ఒక క్రికెటర్ రౌడీగా మారడానికి కారణాలు ఏంటి? చెప్పాం.

టైటిల్ మీద చర్చ జరుగుతుంది? ఏమంటారు?


చాలామంది దీని గురించి అడిగారు. సినిమా పూర్తిగా చూశాక. సరైన పేరే పెట్టారు అనిపిస్తుంది. అప్పట్లో ఒకడుండేవాడు (రైల్వే రాజు)గా శ్రీ విష్ణు నటించారు.

ఫ్యూచర్ ప్లాన్స్? ప్రాజెక్ట్స్?


లవ్, కామెడీ, యాక్షన్‌లతో కూడిన పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేయబోతున్నా. ఇద్దరు పెద్ద హీరోలకు కథ చెప్పాను. వాళ్లకు బాగా నచ్చింది. త్వరలోనే వాటి వివరాలు చెప్తా.

టెక్నీషియన్స్ గురించి?


సాయి కార్తీక్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ నవీన్ యాదవ్ అమెరికాలో నా క్లాస్‌మేట్. ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలకు పనిచేశాడు. బొబ్బిలి సురేష్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాకు మరింత బలం చేకూరింది.

ఉద్యోగం మానేసి సినిమాలు చేస్తున్నారా?


ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో రవిబాబు దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. మధుర శ్రీధర్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను. రవిబాబుగారి దగ్గర టెక్నికల్ డెవలప్ అయితే మధుర శ్రీధర్ గారి దగ్గర మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకున్నాను.అయ్యారే నా మొదటి సినిమా.

అయ్యారే కాంట్రవర్సి అయింది కదా!?


టైం బ్యాడ్ ఉంటే అలానే అవుతుంది. పోస్టర్ మీద ఒక ఫొటో వల్ల హైకోర్టు వరకూ వెళ్లింది. ఎనిమిది నెలల తర్వాత సినిమా విడుదలయింది. మంచి రివ్యూస్ వచ్చాయి. ఆ సినిమా వల్ల మంచి పరిచయాలు, పేరు సంపాదించా.

సాధారణ ప్రేక్షకుడు ఈ సినిమాలో కొత్తగా ఏం చూడొచ్చు?


భారతంలో పాత్రల్లాగే అనిపిస్తాయి. శ్రీ విష్ణును కర్ణుడుగా భావించవచ్చు. కానీ ఏదో దురదృష్టం వెంటాడుతుంటుంది. రోహిత్ దుర్యోధనుడు. అతడికి నచ్చినట్టు చేస్తాడు. అవసరం అయితే రూల్స్ కూడా బ్రేక్ చేస్తాడు. యదార్థ సంఘటనల ఆనవాళ్లు చాలా కనిపిస్తాయి. చివరి నిమిషాల్లో కొన్ని సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. ఈ కథ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్‌తో పాటు పలు విషయాల్లో మిత్రులు ఉడుగుల వేణు, అక్షర కుమార్‌లు చాలా సపోర్ట్ చేశారు.

మీ మీద ఏ దర్శకుడి ప్రభావం ఉందనుకుంటున్నారు?


శివ సినిమా విడుదలయినప్పడు చాలా చిన్న వయసు నాది. అప్పుడు సినిమా అలా ఉండాలి. ఇలా ఉండాలనే విషయాలు పెద్దగా తెలియవు. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ సినిమాల ప్రభావం ఉంటుంది.

కుటుంబ నేపథ్యం?


మాది నల్గొండ టౌన్. నాన్న రాంచంద్రారెడ్డి స్కూల్ టీచర్, అమ్మ సునీత గృహిణి. స్కూలింగ్ మొత్తం నల్గొండ పబ్లిక్ స్కూల్‌లో చదివాను. ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశాను. ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లాను. రెండేళ్లు ఉద్యోగం చేశాను.
అజహర్ షేక్ కంది సన్నీ

1112
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles