అప్డేట్ చేయాలా?వద్దా?


Wed,January 23, 2019 01:28 AM

చాలామంది మొబైల్స్‌లో నోటిఫికేషన్ బార్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్ అని వస్తుంది. లాప్‌టాప్స్, ట్యాబ్స్ కూడా అప్పుడప్పుడు అప్డేట్ అడుగుతుంటాయి. కొందరేమో అప్డేట్ చేస్తే.. ఇంకొందరు అలాగే వదిలేస్తారు. ఇంతకీ అప్డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ చేయాలా? వద్దా?
update
అప్డేట్ చేయాలా? వద్దా ? అనే డౌట్ స్మార్ట్‌ఫోన్స్, లాప్‌టాప్ వాడే చాలామందికి వస్తుంది. అయితే.. సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది ఒక్కో కంపెనీ ఒక్కోలా ఇస్తుంది. వారం, నెల, సంవత్సరం ఇలా ఆయా కంపెనీలు తయారుచేసిన ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు ఆయా కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్డేట్ నోటిఫికేషన్ పంపిస్తుంటాయి. అయితే.. అప్డేట్ చేయాలా ? వద్దా? అనేది మనిష్టం. కావాలంటే చేసుకోవచ్చు.. లేదంటే ఇగ్నోర్ బటన్ నొక్కితే సరిపోతుంది. కాకపోతే అప్డేట్ చేసుకుంటే మొబైల్‌లో కొత్త ఫీచర్లు, కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వస్తాయి. ఆయా కంపెనీలు తమ కంపెనీ గాడ్జెట్లు వాడే వినియోగదారులను ప్రోత్సహించడానికి, తమ ఉత్పత్తులు వేగంగా పనిచేయడానికి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ క్లౌడ్ ద్వారా అప్డేట్ నోటిఫికేషన్లు పంపిస్తుంటాయి. అలా అప్డేట్ చేసుకుంటే ఆ గాడ్జెట్ వేగంగా, సరికొత్త ఫీచర్లతో, కొత్త లుక్‌తో పనిచేస్తుంది. అయితే.. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. అప్డేట్ చేసేటప్పుడు ఫైల్ సైజు ఎంతుంది? మన సిమ్‌కార్డులో డేటా ఎంతుంది? అని చెక్ చేసుకోవాలి. లేకపోతే అప్డేట్ మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ చేస్తే మొదటినుంచి స్టార్టవుతుంది. వీలైనంత వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటేనే మంచిది.

700
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles