అనుకున్నది.. అందుకున్నది


Wed,December 26, 2018 01:51 AM

గట్టిగా అనుకుంటే కాని ఏ పని పూర్తవదు?ఆత్మ విశ్వాసం ఉంటే కానీ ఏ లక్ష్యం దరిచేరదు? వేదాంగి కులకర్ణి గట్టిగా అనుకున్నది. లక్ష్యం చేరుకుంది. లక్ష్యాన్ని అందుకున్నది. రికార్డుల్లోకెక్కింది.
vedamgi
విరామం లేదు. విశ్రాంతి లేదు. ఉన్నది ఒక్కటే లక్ష్యం. సైకిల్ తొక్కాలన్న సంకల్పం. అంతులేని గమ్యానికి తోడైంది ఆత్మవిశ్వాసం. ప్రపంచాన్ని చుట్టేయాలన్న తన లక్ష్యానికి లభించింది విజయం. 19 యేండ్ల వయసున్న అమ్మాయి వేదాంగి కులకర్ణి. సైకిల్ మీద అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన అమ్మాయిగా గుర్తింపు పొందింది. లండన్‌లోని బోర్నెమౌత్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ చదువుతున్న వేదాంగికి సైకిల్ సవారీ అంటే ఇష్టం.రెండేళ్ల క్రితం మనసులో గట్టిగా అనుకొని కష్టనష్టాలకు ఓర్చి లక్ష్యాన్ని పూర్తి చేసింది. జూలైలో ఆస్ట్రేలియాలోని పెర్తలో మొదలైన ఈ యాత్ర డిసెంబర్ 23 ఆదివారం ఉదయం కోల్‌కతాలో పూర్తయింది. రోజుకు మూడు వందల కిలోమీటర్ల చొప్పున వేగంగా సైకిల్ తొక్కుతూ లక్ష్యాన్ని ముద్దాడింది. ఎనభై శాతం ప్రయాణం ఒంటరిగానే చేసింది. స్పెయిన్, కెనడా, పోర్చుగల్, న్యూజిలాండ్ , ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యా దేశాల మీదుగా వచ్చింది. కేవలం భారతదేశంలోనే నాలుగు వేల కిలోమీటర్లు తొక్కింది. 19 యేండ్ల వయసున్న వేదాంగి తన 20వ పుట్టిన రోజును యాత్రలోనే జరుపుకొన్నది.

అనుకున్న టార్గెట్

130 రోజులు.. 29,000 కిలోమీటర్లు అందుకున్న టార్గెట్
159 రోజులు, 29,000 కిలోమీటర్లు

528
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles