అధిక చెమట.. అనారోగ్యానికి మూలం..


Fri,February 22, 2019 12:08 AM

sweat
-కొందరు ఏ పని చేసినా తొందరగా అలిసిపోతారు. ఎక్కువగా అర చేతులకు, కాళ్లకు చెమటలు పడుతుంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. పండ్లు తీసుకోవాలి.
-ఒత్తిడి, భయం వల్ల కూడా చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని రోజూ ఉదయం మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే ఒత్తిడిని అధిగమించవచ్చు. తద్వారా అధికంగా చెమట పట్టదు.
-స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్లలో రెండు చెంచాల వెనిగర్‌ను కలిపి స్నానం చేస్తే ఎక్కువగా చెమటలు పట్టవు. అంతే కాదు ఆలుగడ్డలను ఎక్కువగా తింటే చెమట సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
-గ్రీన్ టీలో ఆస్ట్రినేంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మరుగుతున్న నీటిలో గ్రీన్‌టీ బ్యాగ్‌లు వేసి కొద్ది సేపు ఉడికించాలి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చెమట బాధ నుంచి తప్పించుకోవచ్చు.

877
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles