అదరగొడుతున్న.. ఆరేళ్ల హెయిర్ ైస్టెలిస్ట్!


Thu,January 31, 2019 12:32 AM

6years-old-hairdresser
ఆరేళ్ల వయసుకే హెయిర్ డ్రెస్సర్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఓ బుడతడు. వినడానికి నమ్మేలా లేకపోయినా ఇది మాత్రం నిజంగా నిజం. ఇంతకీ ఎక్కడా? ఏమిటి? అని తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!


చైనా దేశానికి చెందిన జియాంగ్ హాంగ్ అనే పిల్లవాడు అతి చిన్న వయసులో హెయిర్‌ై స్టెలిస్ట్‌గా మారి అబ్బురపరుస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. కత్తెర అంటే ఎలా పట్టుకోవాలో కూడా తెలియని వయసులో సరికొత్త హెయిర్ ైస్టెల్స్‌తో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. జియాంగ్ హంగ్ నాలుగేండ్ల వయసు నుంచే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కత్తెర పట్టుకుని హెయిర్‌ైస్టెలిష్ రంగంలో మెళకువలు నేర్చుకున్నాడు. వారు కూడా అదే రంగంలో నిష్ణాతులు కావడంతో జియాంగ్‌కు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. జియాంగ్ హంగ్ ఎవరి సాయం లేకుండానే షేవింగ్, కటింగ్, డైయింగ్ వంటి పనులు చకచకా చేసేస్తున్నాడు. కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టుగా కటింగ్ చేస్తూ వారి అభిమానాన్ని పొందుతున్నాడు. డిఫరెంట్ హెయిర్ ైస్టెల్స్ చేస్తూ గిరాకీని ఆకర్షిస్తున్నాడు. పెద్దవాళ్ల కంటే వేగంగా, అందంగా కటింగ్ చేయడంతో చిన్నాపెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఈ చిన్నోడితోనే హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. సీనియర్ హెయిర్ ైస్టెలిస్టులకు ఏమాత్రం తీసిపోకుండా అదరగొడుతున్నాడు. తనకు తానే హెయిర్ కట్ చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు. జియాంగ్ హంగ్ కటింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జియాంగ్‌ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 1.5 మిలియన్లు.

458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles