అదరగొట్టే వంటల కోసం..


Mon,April 15, 2019 12:59 AM

చాలా మంది గృహిణులు అద్భుతంగా వంట చేస్తుంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా రుచిగా వండలేకపోతుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే వంట అదరహో..
Potatoes
-వేపుడు కూరలు దించే ముందు కొంచెం శనగపిండి పైన చల్లి కలిపితే మంచి రుచిగా ఉంటాయి.
-కాలీఫ్లవర్ ఉడికేటప్పుడు కొంచెం పాలు పోస్తే దింపిన తర్వాత తెల్లగా కనిపిస్తుంది.
-ఆకు కూరలను ఇనుప బాండీలలో వండకూడదు. నల్లబడిపోతాయి. పిండి వంటలు చేసేటప్పుడు నూనెలో కొంచెం చింతపండుగానీ, బెల్లం ముక్క గానీ వేస్తే పొంగకుండా ఉంటుంది.
-అరటి, బెండ, వంగ, బీర, పొట్ల, అనప, గుమ్మడి, చిక్కుడు, దొండ, దోస, పనస మొదలైన కూరలు వండేటప్పుడు పాత్రమీద మూత ఉంచకూడదు.
-చేమ, ఆలుగడ్డలు, ముల్లంగి, కందలాంటివి ఉడికించేటప్పుడు పాత్ర మీద మూత పెట్టాలి.
-ఉడుకుతుండగా ఆ నీళ్లలో కొంచెం వంట నూనె వేస్తే గిన్నె లోపలి భాగం జిడ్డుకాకుండా ఉంటుంది.

294
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles