అతి ప్రాచీన వృక్షం!


Thu,March 7, 2019 12:38 AM

ఈ భూమిపై ఉన్న జీవరాశులన్నింటిలో అత్యంత ఎక్కువ వయసున్న వృక్షం ఇప్పటికీ సజీవంగానే ఉన్నది. దీనిని చెట్టు కాదు మహావృక్షం అనాలి. ఎందుకంటే దాని వయసు చెబితే మీరు కూడా మహా.. వృక్షమనే అంటారు. ఇంతకీ దీని వయసు వందో, రెండు వందల ఏండ్లో కాదు. 80వేల ఏండ్లు. ఈ మహా.. వృక్షం పేరు పాండొ. ఇది అమెరికాలోని ఉతా ప్రాంతంలోని ఫిష్‌లేక్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నది.
pando-tree
ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైందిగా పరిశోధకులు గుర్తించారు. ఒకేరకమైన వేర్లు కలిగి ఉండడం పాండొ విశేషం. కొన్ని వేల శతాబ్దాలకు పూర్వమే పాండొ భూమిలోకి వేళ్లూనుకుని ఉన్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అక్కడి అటవీ ప్రాంతమంతా అల్లుకుపోయింది. పాండొ మహా వృక్షం అనేది ఒకే వృక్షంగా ఉండదు. కొమ్మలు మాదిరిగా ఆయా ప్రదేశమంతటా వేళ్లూనుకుని ఉంటుంది. ఇది గడ్డి మొక్కల వలే చుట్టు పక్కల అంతా పాకుతూ పెరుగుతుంది. భూగ్రహంపై అత్యంత పురాతనమైన జీవిగా ఈ వృక్షాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పాండొ వయసు 80వేల ఏండ్ల కంటే ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ వృక్షం పెరుగుతూనే ఉన్నది. దీని వేర్లు భూమిలోపల ఎంతో లోతుగా పాతుకుపోయి ఉండడం వల్ల అటవీ ప్రాంతంలో ఉండే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినట్లు కనిపిస్తుంటుంది. దాదాపు 106 ఎకరాల స్థలంలో పాండొ చెట్టు వ్యాపించి ఉంటుంది. కొమ్మలు, ఆకుల బరువు సుమారుగా 6,600 వరకు ఉంటుంది.

330
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles