అతిచిన్న మగబిడ్డ!


Tue,March 5, 2019 03:06 AM

-సుమారు పావు కిలో (కేవలం 268 గ్రాములు) బరువుతో పుట్టిన ఒక మగబిడ్డకు వైద్యులు కొత్తగా ప్రాణం పోసినంత పనిచేశారు. తల్లి గర్భాశయానికి బయట ఆసుపత్రిలో అయిదు నెలల సంరక్షణ అనంతరం ఆ బిడ్డ మూడు కిలోలకు పైగా బరువు పెరిగింది.
Vaidya
జపాన్‌లోని కీయో (Keio) యూనివర్సిటీ హాస్పటల్ వైద్యులు ప్రపంచంలోనే అతిచిన్న మగబిడ్డకు ఊపిరి పోశారు. కిందటేడాది (2018) ఆగస్టులో ఈ ఆసుపత్రిలో కేవలం 9.45 ఔన్సుల (268 గ్రాములు) అత్యల్ప బరువుతో మగబిడ్డ జన్మించింది. తల్లి గర్భంలో కేవలం 24 వారాలు (ఆరు నెలలు) మాత్రమే ఎదిగిన ఈ బిడ్డను ఇంకా గర్భాశయంలోనే ఉంచితే ప్రాణాపాయ స్థితి ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి వెలికి తీశారు. ఈ బిడ్డ ఎంత చిన్నదంటే తల్లిదండ్రుల రెండు అరచేతుల నడుమ తన మొత్తం దేహం ఒదిగిపోయింది.

అంటే, ఒక పెద్ద బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్ అంత బరువు మాత్రమే. కేవలం పావుకిలోకంటే కొంచెం ఎక్కువ బరువుతో ఈ పసివాడు ప్రపంచంలోనే అతిచిన్న బిడ్డగా రికార్డు సృష్టించాడు. పూర్తిగా ఎదుగుదల లేని కారణంగా ఈ బిడ్డ తనంతట తాను స్వయంగా ఊపిరి పీల్చుకోలేకపోవడమేకాదు, ఆహారాన్ని కూడా తీసుకోలేడు. అందువల్ల వైద్యులు బయటే సంరక్షణ ఏర్పాట్లు చేశారు. వారి అద్భుత కృషి, సేవలతో ఆ పిల్లాడు కొత్త జన్మెత్తాడు. గత ఫిబ్రవరి 20న బిడ్డను డిశ్చార్చి చేసే సమయానికి 7 పౌండ్లు (3.2 కేజీలు) బరువు పెరిగాడు.

252
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles