అతిగా తాగితే..


Sat,September 1, 2018 10:28 PM

ఈ రోజుల్లో కొబ్బరి బోండాలు, కూల్‌డ్రింక్స్, కాఫీ, మిల్క్‌షేక్ వంటి పానీయాలను స్ట్రా తో తాగడం ఫ్యాషన్ అయిపోయింది. స్ట్రాతో పానీయాలను అతిగా తాగినట్లయితే రోగాల పాలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
strawf
కొబ్బరి బోండాలు, మిల్క్‌షేక్, జ్యూస్ వంటి పానీయాలను స్ట్రాతో తాగడం తప్పనిసరి అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వాడిన స్ట్రాలనే మళ్లీ వాడుతున్నారు. స్ట్రాతో పానీయాలను అతిగా తాగడం వల్ల రోగల బారిన పడడం ఖాయమని నిపుణులు అంటున్నారు. స్ట్రాతో తీపి పానీయాలను తాగినట్లయితే దంతాల ఎనామిల్ దెబ్బతింటుందట. స్ట్రాతో తాగుతున్నప్పుడు డ్రింక్‌తో పాటు గాలి కూడా కడుపులోకి చేరుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడి గ్యాస్, ఉబ్బరం వంటి రోగాలకు దారి తీస్తుంది. స్ట్రాతో తాగడం వల్ల ఎంత తాగుతున్నామో తెలియక ఎక్కువగా తాగేస్తుంటాం. అప్పుడు శరీరంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. ఈ స్ట్రాలను పాలీప్రొఫైలిన్‌తో తయారు చేస్తారు. కాబట్టి స్ట్రాతో పీల్చితే పానీయాలతో పాటు రసాయనాలు కూడా శరీరంలోకి చేరుతాయి. అంతేకాకుండా చర్మం ముడుతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక నుంచి డ్రింక్స్ స్ట్రాలు లేకుండా తాగడం అలవాటు చేసుకోండి.

460
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles