అచ్చు పెద్దల్లాగే..!


Fri,February 8, 2019 01:43 AM

ఒకప్పుడు ఫ్యాషన్ అంటే పెద్దలకు మాత్రమే అన్నట్లుండేది.. కానీ ఫ్యాషనిస్టులు ఇప్పుడు పిల్లలకు ఆ ట్రెండ్ తీసుకొచ్చారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా ముద్దులొలికే పిల్లలకూ.. సరికొత్త డిజైన్లతో మార్కెట్ నిండిపోతున్నది.. పాప.. బాబు.. అనే తేడా లేకుండా ఇద్దరికీ రంగురంగుల్లో.. అచ్చు పెద్దల ఫ్యాషన్ ట్రెండ్‌ని ఫాలో అయిపోతున్నారు.. అలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ మీకోసం..
Fashan
1. సూటు.. బూటు వేస్తే పిల్లలు హుందాగా కనిపిస్తారు. చెక్స్ ప్యాటర్న్‌లో వచ్చిన ఖాకీ కలర్ ప్యాంట్ ఇది. దానికి యెల్లో కలర్ షర్ట్ ఇచ్చారు. పీచ్ కలర్ చెక్స్ జాకెట్ దీనికి పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది.

2. బ్లూ కలర్ ప్లెయిన్ లాంగ్ గౌన్ ఇది. కింద ఎక్కువ గేర్ వచ్చేలా కుట్టారు. పైన హాఫ్ షోల్డర్‌తో చూడముచ్చటగా కనిపిస్తున్నది. ఎర్రని కుచ్చులతో వచ్చిన పువ్వు డ్రెస్ అందాన్ని రెట్టింపు చేసింది.

3. డిఫరెంట్‌గా ఉండాలనుకునేవారు ఈ డ్రెస్ ఎంచుకోవాల్సిందే! ఆకుపచ్చని నెట్ ఫ్యాబ్రిక్‌తో స్లీవ్‌లెస్, లాంగ్ గౌన్ కుట్టారు. దీనికి మల్టీ కలర్ పూసలను అటాచ్ చేశారు. నడుముకు వచ్చిన బెల్ట్, పువ్వు దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది.

4. చెక్స్ ప్యాటర్న్ హవా నడుస్తున్నదీ మధ్య కాలంలో. బ్లూ, యెల్లో కాంబినేషన్‌లో వచ్చిన ప్యాంట్ ఇది. దీనికి ప్లెయిన్ రాయల్ బ్లూ షర్ట్, రెడ్ బౌ పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి.

500
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles