అక్కడ పాముల్ని పెంచుకుంటారు!


Thu,January 31, 2019 12:27 AM

Vadi-tribe
చాలామందికి జంతువుల్ని పెంచుకునే అలవాటు ఉంటుంది. కొందరు కుక్కలు, పావురం, పిల్లి, గుర్రం, చిలుక, కుందేలు ఇలా రకరకాల జంతువుల్ని పెంచుకొని ప్రేమగా చూసుకుంటారు. కానీ ఓ ఊర్లో పాములు పెంచుకుంటారు. ఎక్కడో తెలుసా?


గుజరాత్‌లోని వడి అనే గిరిజన జాతి వారి కులదైవం పాము. అందుకే వారికి పాములంటే ఎనలేని భక్తి, ప్రేమ. అంతేకాదు వడి జాతిలో పుట్టిన వారు పాములాడించుకోవడమే జీవనాధారం. ఆ వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తారు. 10వ శతాబ్దం నుంచి వారికి పాములాడించడమే ఉపాధి మార్గంగా బతుకుతున్నారు. అందుకే వారి ఇంటి నిండా పాములుంటాయి. పుట్టిన రెండు సంవత్సరాల నుంచే పాములు పట్టడం నేర్పిస్తారు. పాములను మచ్చిక చేసుకోవడం, విష నాగులను సైతం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండానే పట్టుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కొత్తవారు వీరి ఇంటికి వెళ్లాలంటేనే జంకుతారు. ముందూ వెనుక చూడకుండా వీళ్ల ఇంట్లోకి అడుగు పెడితే మనుషుల కంటే ముందు బుస్సుమంటూ పాములే స్వాగతం పలుకుతాయి. వందల ఏండ్లుగా ఇదే ఆచారంగా జీవిస్తున్న ఈ తెగలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా పాముకాటుతో చనిపోలేదంటే ఆశ్చర్యం వేయక మానదు.

280
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles