అక్కడే పుట్టి.. అక్కడే కలిసి..


Wed,April 24, 2019 12:11 AM

సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా! ఒకే ఆస్పత్రిలో పుట్టిన హీరో, హీరోయిన్ చిన్నప్పుడే ఎక్కడో అనుకోకుండా కలుసుకుంటారు. పెద్దయ్యాక ప్రేమలో పడతారు. అచ్చం అలానే ఓ దేశంలో జరిగింది. ఒకే ఆస్పత్రిలో ఒకేరోజు పుట్టిన ఇద్దరు, మళ్లీ అక్కడే కలిసి, అదే తేదీనాడు పెండ్లి చేసుకోబోతున్నారు.
couple
కొన్ని ప్రేమకథలు స్వర్గంలోనే తయారవుతాయి అంటుంటారు. కానీ వీళ్ల ప్రేమ కథ మాత్రం ఆస్పత్రిలో పుట్టింది. గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన షానా గ్రేసీ, టామ్ అదే దేశంలోని ఒకే ఆస్పత్రిలో పుట్టారు. 1992 డిసెంబర్ 22 నాడు జన్మించారు. కట్‌చేస్తే వీళ్లు మళ్లీ 2010లో ఒకే హోటల్‌లో జరుగుతున్న వారి పుట్టిన రోజు వేడుకల్లో ఎదురుపడ్డారు. ఆ సమయంలో టామ్ నింజా డ్రెస్‌లో, గ్రేసీ మిన్నీ మౌస్ డ్రెస్‌లో ఉంది. అప్పుడే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం అయింది. టామ్ తొలిచూపులోనే గ్రేసీని ఇష్టపడ్డాడు. అక్కడ మొదలైన వారి పరిచయం మెల్లిగా వికసించింది. తన ప్రేమ విషయాన్ని టామ్ వ్యక్తపరిచినప్పుడు గ్రేసి తిరస్కరించింది. కానీ టామ్ తన ప్రయత్నాలు కొనసాగించాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ అదే విషయం అడిగితే గ్రేసీ కోపగించుకుంది. ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఈ కాలంలో టామ్‌ను మిస్ అయిన భావన కలిగింది గ్రేసీకి. ఒకరోజు టామ్‌ను అదే ఆస్పత్రి దగ్గర చూసిన గ్రేసీ తల్లడిల్లిపోయింది. అతని గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయింది. అప్పుడే గ్రేసీ తన అభిప్రాయాన్ని చెప్పింది. ఎనిమిదేండ్లలో నేను ఎప్పుడూ ఆనందంగా లేను, మనము ఒకరి కోసం ఒకరం జన్మించాము. నన్ను పెండ్లి చేసుకుంటావా? అని అడిగింది. ఇలా వారి ప్రేమ ఇప్పడు పెండ్లి పట్టాలు ఎక్కబోతున్నది. వారి పుట్టిన రోజునాడే పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ చిన్ననాటి ప్రేమపక్షులు.

270
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles