అందాల మాల్డా


Thu,December 27, 2018 11:21 PM

దక్షిణ బెంగాల్ నుంచి ఉత్తర బెంగాల్‌కు వెళ్లేవారికి మాల్డా సింహద్వారం. మాల్డా ప్రాంతాన్ని గౌర్, పండువా రాజ వంశాలు పాలించాయి. వారి తదనంతరం ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని ఇంగ్లిష్ బజార్ పేరుతో పాలించారు. గౌరీ-బంగా ప్రాంతంగా మాల్డాను ఒకప్పుడు పిలిచేవారు. ఇది మహానంద నది ఒడ్డున ఉంది. గంగా, మహానందా, ఫుల్హర్, కాళింది నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహించడం ద్వారా అనేక పంటలతో సస్యశ్యామలమైంది. అలాగే అనేక రాజవంశాలు ఇక్కడ వర్ధిల్లాయి.
Malda-Murshidabad
మాల్డా పట్టణాన్ని గౌరీపురగా పిలిచేవారు. పండువా రాజ్యాన్ని పుండ్రబర్ధనగా కూడా పిలిచేవారు. బెంగాల్ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలో మాల్డాను గౌర్, పండువాగా పిలిచేవారు. మౌర్య సామ్రాజ్యంలో పుంద్రబర్ధన లేక పుండ్ర నగర్లు భాగంగా ఉండేవి. మాల్డాకు కొత్త అందాలను కల్పించడంలో బౌద్ధ మత పాలా, హిందూ సేనా వంశంతో పాటుగా ముస్లిం నవాబులు తమ వంతు కృషి చేశారు. చారిత్రకంగా మాల్డాకు ఘన చరిత్రే ఉంది. గంగానది ప్రవహించే ప్రాంతం కావడంతో మాల్డాలో అతి మేలైన ఫాల్జా మామిడి పండ్లు పండుతాయి. దేశవ్యాప్తంగా పండే మామిడి పళ్ళలోకెల్లా అత్యంత తియ్యని మామిడిగా ఫాల్జా మామిడి పళ్లకు మంచి గుర్తింపు ఉంది.

569
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles