అందరి కోసం అర్బన్ వన్


Sat,February 9, 2019 02:02 AM

Aerial-View
హైదరాబాద్‌లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. గచ్చిబౌలి నుంచి నార్సింగి ప్రాంతమే ముందువరుసలో ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడ్నుంచి సులువుగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లకు రాకపోకల్ని సాగించొచ్చు. ఫలితంగా, ట్రాఫిక్ రణగొణధ్వనుల్లో సమయం వృథా అయ్యే ఆస్కారమే ఉండదు. ఈ అంశాన్ని ముందే ఊహించిన ఎన్‌సీసీ అర్బన్ కు చెందిన వరప్రద రియల్ సంస్థ.. ఇదే మార్గంలోని సర్వీస్ రోడ్డు పక్కనే.. ఎన్‌సీసీ అర్బన్ వన్ అనే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పును నిర్మిస్తోంది. కొనుగోలుదారులకు విజయవంతంగా ప్రప్రథమంగా అందజేసిన ప్రాజెక్టుగా ఇది ఖ్యాతినార్జించింది. కొన్ని కుటుంబాలు సైతం ఇందులో స్థిరనివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. నివాస సముదాయం, వాణిజ్య భవనం, రిటైల్ షాపింగ్ మాళ్లు, స్కూలు.. ఇలా నివాసితులకు అన్ని రకాలుగా అక్కరకొచ్చేలా.. ఎన్‌సీసీ అర్బన్ వన్ రూపుదిద్దుకోవడం విశేషం. మొత్తానికి, 32 ఎకరాల్లో.. యాభై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకున్నది.

భాగ్యనగరంలో సరికొత్త మార్పు సంతరించుకుంటుంది. ఒకప్పుడు పాతబస్తీ నుంచి ఆరంభమైన నగరాభివృద్ధి నాంపల్లి, ఆబిడ్స్, కోఠి చుట్టుపక్కల కేంద్రీకృతమయ్యేది. గత నాలుగు దశాబ్దాల నుంచి నగర పరిధి విస్తరించడం ఆరంభమైంది. లక్డీకాపూల్ నుంచి పంజాగుట్ట, అమీర్‌పేట్‌కు వాణిజ్య, నివాస భవనాలు ఏర్పడ్డాయి. అక్కడ్నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలికి అభివృద్ధి సాక్షాత్కరించింది. ఇక నుంచి హైదరాబాద్ అభివృద్ధి అంతా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కేంద్రీకృతం కానున్నది. గచ్చిబౌలి నుంచి నార్సింగి వరకూ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు పక్కనే వెలుస్తున్న ఆకాశహర్మ్యాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ అంశాన్ని ముందే గమనించిన ఎన్‌సీసీ అర్బన్.. నార్సింగి సర్వీస్ రోడ్డు పక్కనే అర్బన్ వన్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పునకు శ్రీకారం చుట్టింది. సుమారు 22 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో నివాస సముదాయాలు 20 ఎకరాల్లో తీర్చిదిద్దుతున్నది. మిగతా రెండెకరాలను కేవలం వాణిజ్య సముదాయానికే కేటాయించింది. ఇందులో మొత్తం వచ్చేవి నాలుగు టవర్లు. ఒక్కో టవర్‌ను స్టిల్ట్+ 18 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నది.

స్థిరనివాసం ఏర్పాటు..

మొదటి ఫేజులో నాలుగు టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. రెండో విడతలో ప్రస్తుతం పనులు యమజోరుగా జరుగుతున్నాయి. ఐదో టవర్ స్ట్రక్చర్ పూర్తవుతుండగా.. ఆరో టవర్ పన్నెండో శ్లాబులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టులో నూట యాభైకి పైగా కొనుగోలుదారులకు సంస్థ ఫ్లాట్లను అప్పగించింది. వీటిలో దాదాపు యాభై మంది దాకా నివాసమేర్పరుచుకున్నారు. మిగతా వారు తమ ఫ్లాట్లలో ఇంటీరియర్ పనుల్ని జరిపిస్తున్నారు. ఇక రెండో ఫేజులోని ఐదో టవర్‌ను 2019 జులైలోపు కొనుగోలుదారులకు అందించడానికి సంస్థ ప్రణాళికల్ని రచిస్తున్నది. ఈ ప్రాజెక్టు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు కూతవేటు దూరంలో ఉండటం వల్ల.. ఐటీ సంస్థల్లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సీఈవోలు, వైస్ ప్రెసిడెంట్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు వంటివారు ఇందులో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇదే ప్రధాన ఆకర్షణ..

ఎన్‌సీసీ అర్బన్ వన్‌లో రూపుదిద్దుకుంటున్న క్లబ్‌హౌజ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సెలూన్, డే కేర్ సెంటర్, ఇండోర్ గేమ్స్, జిమ్, మల్టీపర్పస్ హాల్ వంటివి నివాసితులకు విజయవంతంగా అందజేశారు. మొత్తానికి, ఈ క్లబ్‌హౌజ్ పనులు 80 శాతం దాకా పూర్తయ్యాయి. ఇక స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టు, రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్టు వంటివి నాలుగు నెలల్లోపు నివాసితులకు అందజేస్తామని సంస్థ చెబుతున్నది. సిమెంటు కాంక్రీటు కంటే పచ్చదనమే అధికంగా దర్శనమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నది. ఇందులో నివసించేవారు గచ్చిబౌలియే కాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు ఇట్టే చేరుకోవచ్చు. ఇంట్లో నుంచి అలా నడుచుకుంటూ ఆవరణలోనే నిర్మించే ఆఫీసుకు చేరుకోవచ్చు. అదేవిధంగా.. సూపర్ మార్కెట్లు, స్కూలు, ఆస్పత్రి వంటి వాటికి ఇట్టే వెళ్లిరావొచ్చు.

భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేసి..

ఔటర్ రింగ్ రోడ్డు చేరువలో.. ప్రపంచ ఐటీ, ఆర్థిక దిగ్గజ సంస్థలకు అతిచేరువలో.. 32 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం.
భవిష్యత్తులో 5 జీ సాంకేతిక సేవలతో వాణిజ్య, ఐటీ పార్కులు అభివృద్ధి చెందుతాయి. దీంతో, నార్సింగి చుట్టుపక్కల ప్రాంతాలు వాణిజ్య సముదాయాలు ఏర్పడటానికి పూర్తి అవకాశముంది. ఇలాంటి అభివృద్ధిని అంచనా వేసి.. ఎన్‌సీసీ అర్బన్ వన్‌కు శ్రీకారం చుట్టాం. 32 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ఇంటిగేటెడ్ టౌన్‌షిప్పు ఆధునిక యువ కొనుగోలుదారులకు ఇట్టే నప్పుతుంది.
- ఎన్‌ఆర్ అల్లూరి, ఎండీ, ఎన్‌సీసీ అర్బన్

553
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles