అందమైన ముఖారవిందానికి..


Mon,February 4, 2019 01:26 AM

దుమ్ము, ధూళీ వల్ల చర్మంపై మృతకణాలు పెరిగిపోతాయి. చిన్న వయసులోనే ఒత్తిడి కారణంగా ముడుతలు పడుతాయి. తగిన శ్రద్ధ తీసుకోకపోతే ముఖం కాంతిని కోల్పోతుంది. ఈ చిట్కాలు పాటించి ముఖకాంతిని పెంచుకోండి.
face-tips
-పెరుగులో కొద్దిగా కలబంద గుజ్జు, నిమ్మరసం, శనగపిండి కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే మొటిమలు, నల్లటి వలయాలు తొలిగిపోతాయి.
-కాఫీ పొడిలో కొద్దిగా ఉప్పు, తేనె, కీరదోస రసం కలిపి ముఖానికి మెడకు పూసుకోవాలి. రెండు గంటల తర్వాత కడిగేస్తే సత్వర ఫలితం కనిపిస్తుంది. కాఫీ పొడిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై వ్యర్థాలను తొలిగిస్తాయి.
-చక్కెర నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్నానం చేస్తే శరీరంపై జిడ్డు తొలిగిపోతుంది.
-సబ్బును వాడకుండా కనీసం రెండు గంటలకోసారైనా నీటితో ముఖాన్ని కడుక్కుంటే ముఖం కాంతివంతమవుతుంది.
-రెండు స్పూన్ల రోజ్ వాటర్లో ఒక స్పూన్ గ్లిజరిన్‌ను కలిపి చెంపలకు రాసుకుంటే ముడుతలు రాకుండా ఉంటాయి.
-ప్రతి రోజూ 5 లేక 6 సార్లు బూరను ఊదడం వల్ల ముఖానికి మంచి వ్యాయామం దొరుకుతుంది.

723
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles