అందమైన జంట అరుదైన ముచ్చట్లు


Tue,December 12, 2017 11:29 PM

virat-anushka
డ్యాషింగ్ బ్యాట్స్‌మన్, అందమైన హీరోయిన్ ఒక్కటయ్యారు. విషయం విరాట్ కోహ్లి, అనుష్కల గురించేనని అర్థమైపోయుంటుంది మీకు. అయితే ఇన్నాళ్లూ ప్రేమ పక్షుల్లా విహరించి, రీసెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ఈ అందమైన జంట గురించి చాలామందికి తెలియని కొన్ని ముచ్చట్లు.
virat-anushka1
విరాట్ కోహ్లి, అనుష్కలు తొలిసారిగా ఒక షాంపూ కోసం చేసిన యాడ్ షూటింగ్‌లో కలిశారనే విషయం ప్రచారంలో ఉన్నది. అది అస్సలు నిజం కాదు. అనుష్కను తొలిసారిగా హీరో రణ్‌వీర్‌కపూర్ ఈ డాషింగ్ క్రికెటర్‌కు పరిచయం చేశాడట. అప్పుడే వీళ్లిద్దరి హృదయాల్లోకి ప్రేమమెరుపులు ప్రవేశించాయి.
virat-anushka2
అనుష్క 26వ పుట్టినరోజుకు విరాట్ ఐపీఎల్ టౌర్నమెంట్‌తో బిజీగా ఉన్నాడు. అయినా అనుష్క కోసం స్పెషల్ ైఫ్లెట్‌లో జోధ్‌పూర్ వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చాడట. ప్రేమ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం. విరాట్, అనుష్కల ప్రేమ కూడా అలాంటిదే. ఒక మ్యాగజైన్ కవర్ కోసం అనుష్క ఫుల్ ఎక్స్‌ఫోజింగ్ ఫొటోషూట్ చేసినందుకు విరాట్‌కు చాలా కోపం వచ్చిందనే టాక్ వినిపించింది. పెద్ద గొడవే జరిగిందనే ప్రచారం జరిగింది. అవన్నీ అతనికి అనుష్కపై ఉన్న ప్రేమ ముందు నిలబడలేకపోయాయన్నది అసలు నిజం.
virat-anushka3
ఒకానొక సమయంలో అనుష్క ఉన్న గ్లామర్ ప్రపంచం విరాట్‌కు నచ్చలేదట. ఆమె ఎక్స్‌పోజింగ్ చేయడం ఇబ్బందిగా అనిపించిందట. అందుకే అనుష్కను ఆ ఫీల్డు నుంచి బయటకు వచ్చేయమన్నాడట. మంచి నటిగా పేరుతెచ్చుకొన్న అనుష్క అందుకు ఒప్పుకోకపోవడంతో.. బ్రేకప్ చెప్పేదాకా వెళ్లిందట. కానీ ఆ గొడవ నుంచి తొందరంగానే బయటపడ్డారిద్దరూ. మళ్లీ ఒకరికి ఒకరై ముందుకు నడిచి, పెళ్లి పీటలెక్కారు.
virat-anushka4
విరాట్, అనుష్కల గాఢమైన ప్రేమానుబంధానికి చక్కటి ఉదారణ వాళ్లిద్దరూ ధరించే గొలుసులు. వాళ్లు ధరించే డాగ్ ట్యాగ్ చైన్స్ ఒకేలా ఉంటాయి. దీన్ని బట్టే విరుష్కల ఆలోచనలు ఒకేరకంగా ఉంటాయని చెప్పొచ్చు.
విరాట్, అనుష్కల పెళ్లికి పెద్దలు ఒప్పుకొంటారా? లేదా? అనే అంశంపై సోషల్ మీడియలో చాలా పెద్ద చర్చే జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. ఈ జంటను వాళ్ల పెద్దవాళ్లు ఎప్పుడో ఆశీర్వదించారట.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles