అందమే ఆనందం!


Wed,February 27, 2019 12:34 AM

అందంగా ఉండడానికి అమ్మాయిలు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఇంట్లో దొరికే వాటితోనే అందాన్ని రెంట్టింపు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
skincare
-పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని ముఖానికి రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారంపాటు క్రమం తప్పకుండా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
-జాజికాయను తీసుకొని చెక్కమీద బాగా రుద్దాలి. వచ్చిన రసాన్ని రాత్రి సమయంలో కంటి చుట్టూ రాసుకోవాలి. ఉదయాన్నే చల్లని నీటితో కడుగాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే కంటికి చల్లదనాన్నిచ్చి నల్లటి వలయాలను తొలిగిస్తుంది.
-దేవుడి పూజకి వాడిన పూలను బాగా ఎండబెట్టాలి. దీంతో పాటు కాస్త పసుపు చేర్చి పౌడర్ చేయాలి. ఈ పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి ముఖానికి రాయాలి. ఆరాక నీటితో కడుగాలి. ఇలా చేస్తే కాంతివంతంగా ఉంటారు.
-మీగడలో కొద్దిగా ఆలివ్‌నూనె కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 50 నిమిషాల తర్వాత ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత నీటితో కడిగితే ముడతల చర్మం పోతుంది.
-పాలలో కొంచెం తేనె, ముల్తాని మట్టి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం మెరుస్తుంటుంది.

272
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles