కావలసిన పదార్థాలు
కొత్తిమీర: రెండు కట్టలు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, ఉల్లిపాయ: ఒకటి, క్యారెట్: రెండు, నిమ్మకాయ: ఒకటి, కొబ్బరిపాలు: అర కప్పు, ఉప్పు: తగినంత, లెమన్‌గ్రాస్ స్టాక్: ఒక కప్పు, ఉల్లికాడలు: అర కప్పు
తయారీ విధానం
ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లికాడలను చిన్నగా తరగాలి. ఒక పాత్రలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, లెమన్‌గ్రాస్ స్టాక్ తీసుకోవాలి. అందులో కొబ్బరిపాలు, ఒక కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై అరగంటపాటు మరిగించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మరొక పాత్రలో వడబోయాలి. అందులో క్యారెట్ తురుము, ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు మరిగించాలి. కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి లెమన్ కొరియాండర్ సూప్ రెడీ.