e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home యాదాద్రి కొనుగోళ్ల జాతర

కొనుగోళ్ల జాతర

కొనుగోళ్ల జాతర
  • కొనుగోలు కేంద్రాలకు అంచనాలకు మించి తరలివస్తున్న వరి ధాన్యం
  • జిల్లావ్యాప్తంగా 286 కేంద్రాల్లో ప్రారంభమైన కొనుగోళ్లు
  • ఇప్పటివరకు 1,05,432 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ప్రతి సీజన్‌లో నూ రైతులకు భరోసా కల్పిస్తూ వస్తున్నది. సీఎం కేసీఆర్‌ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేశారు. గత సీజన్లలో రికార్డు స్థాయిల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పటికీ ప్రభుత్వం చివరి కొని రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈసారి కూ డా యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది. దీంతో జిల్లాలో 286 ధాన్యం కేంద్రాలను అధికారులు ప్రారంభించి కొనుగోళ్లు జరుపుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. ధాన్యం దిగుబడులు ఎక్కువగా ఉన్న చోట.. కల్లా ల వద్దకే లారీలను పంపించి ధాన్యం కొనేలా చర్యలు తీసుకుంటున్నారు.

అధికారుల నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో 95 ఐకేపీ, 187 పీఏసీఎస్‌, 4 మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా..ఆయా శాఖల అధికారులు నిరంతరం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కేం ద్రాల్లో ధాన్యం తూకం మొదలు..మిల్లుల్లో దిగుమతి చేసే వరకు పర్యవేక్షణ ఉంటుండటంతో రైతులకు ఇబ్బందులు సైతం కలుగడం లేదు. కేం ద్రాలకు వస్తున్న నాణ్యమైన ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. ప్రతి నిత్యం 225 లారీలను నడుపుతుండగా.. గత రెండు రోజులుగా 350 వరకు లారీలను నడిపిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన 30 రైస్‌ మిల్లుల్లో ధాన్యం దిగుమతుల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నారు.

రికార్డు స్థాయిలో 1,05,432 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
యాసంగి ధాన్యానికి సంబంధించి 4.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తుండటంతో సజావుగా కొనుగోళ్లు సాగుతూ..కేంద్రాలు ప్రారంభించిన కొద్దిరోజులకే లక్ష్యానికి మించి కొనుగోళ్లు జరుగుతున్నాయి. యాసంగి దిగుబడులు బాగా ఉన్న నేపథ్యంలో కేంద్రాలకు భారీగా ధాన్యం తరలివస్తుండగా.. అదే స్థాయిలో కొనుగోళ్లు సైతం జరుగుతున్నాయి. ప్రతి నిత్యం 7-8వేల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండ గా.. ఈనెల 5న రికార్డు స్థాయిలో 12,500 మెట్రి క్‌ టన్నుల ధాన్యాన్ని కేంద్రాల్లో ఒకే రోజు కొనుగోలు చేశారు. శుక్రవారం సైతం 11వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన 286 కొనుగోలు కేంద్రాల్లో 11,180 మంది రైతుల నుంచి 1,05,432 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగో లు చేశారు. సంబంధిత ధాన్యానికి సంబంధించి రూ.182 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. అ యితే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించి ట్యాబ్‌ ఎంట్రీ పూర్తయిన వాటికి సంబంధించి రూ.54కోట్లను అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. నాలుగైదు రోజుల్లోనే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో రైతులు సంబరపడి పోతున్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రామాల్లో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియో గం చేసుకోవాలని భువనగిరి వ్యవసాయ మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ నల్లమాస రమేశ్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని బస్వాపురంలో ఐకేపీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్ర వారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట సర్పంచ్‌ మంజుల, ఉప సర్పంచ్‌ కరుణ, ఏఎంసీ సెక్రటరీ అజిత్‌రావు, డైరెక్టర్‌ రమేశ్‌, శ్రీశైలం, తిరుపతి, మహిళా సంఘం అధ్యక్షురా లు లావణ్య, భాగ్యమ్మ, దుర్గపతి చంద్రమ్మ, వార్డు సభ్యులు భిక్షపతి, శ్రీశైలం పాల్గొన్నారు.

పెద్ద మొత్తంలో ధాన్యం వస్తున్నది
ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగో లు కేంద్రాలకు తరలివస్తున్నది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా.. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి పరిష్కరిస్తున్నాం. టీంలను ఏర్పాటు చేసి రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం.
-అనితారామచంద్రన్‌, కలెక్టర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనుగోళ్ల జాతర

ట్రెండింగ్‌

Advertisement