e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home యాదాద్రి పుస్తకాలొచ్చినయ్‌

పుస్తకాలొచ్చినయ్‌

  • పాఠశాలల పునః ప్రారంభానికి ముందే సరఫరా
  • ప్రతి పుస్తకానికీ క్యూఆర్‌ కోడ్‌
  • ఈ నెల 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం
పుస్తకాలొచ్చినయ్‌

ఆలేరు టౌన్‌, జూన్‌ 12 : ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రా రంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ సిద్ధం అయ్యింది. 2021-22 విద్యా సంవత్స రాని కి సంబంధించి పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జడ్పీ, ఉన్నత, మోడల్‌ పాఠశాలలతో పాటు సంక్షేమ, గురుకుల పా ఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకా లు అందజేస్తారు. జిల్లాలో మొత్తం 3,30,000 పుస్తకాలు అవసరమని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత విద్యా సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన 9వేల పాఠ్యపుస్త కాలు గోదాంలో మిగిలి ఉన్నాయి. అయితే జిల్లాకు ఇంకా 3,21,000 రావాల్సి ఉండగా 1,29,150 వచ్చాయి. మరో 1,91,850 పుస్తకాలు రావాల్సి ఉంది. గత ఏడాది కరోనా విజృంభన దృష్ట్యా పాఠ్యపుస్తకాలు ముందస్తుగానే బడులకు చేరుకున్నా.. తరగతులు మొదలు కాని పరిస్థితి నెలకొంది. అ యినప్పటికీ విద్యార్థులకు బుక్స్‌ అందజేసి ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించారు. బడులు తెరిచే నాటికి పిల్లల చేతుల్లో పుస్తకా లు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

పుస్తకాలు పక్కదారి పట్టకుండా
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ గతంలో పుస్తకాలు అందేవి కావు. ఇలాంటి అక్రమాలకు చెక్‌ పెట్టేం దుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రతి పుస్తకా నికి క్రమ సంఖ్యను కేటాయించింది. ఏ మండలానికి ఎన్ని పు స్తకాలు చేరాయో అధికారులు నమోదు చేస్తున్నారు. అనంత రం అక్కడి అధికారులు వాటిని ఏ పాఠశాలలకు పంపుతున్నా రో ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో జిల్లా విద్యాశాఖకు తెలియజే యాలి. విద్యార్థులకు ఏ వరుస సంఖ్య నంబర్‌ పుస్తకాలు ఇస్తు న్నారో పాఠశాల రికార్డులో కూడా నమోదు చేస్తారు. అలాగే 6 నుంచి 10వ తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాల్లోని పా ఠ్యాంశాలను దృశ్య రూపకంగా వీక్షించి, సులభంగా అర్థం చే సుకునేలా తయారు చేశారు. గత ఏడాది సైన్స్‌ పుస్తకాలు ఇలా గే ఉండగా, ఇప్పుడు అన్ని పుస్తకాల్లోని పాఠాలను వీక్షించేలా వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రతీ బుక్కుపై అందు లోని అన్ని పాఠాలకు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించా రు. సెల్‌ఫోన్‌ ద్వారా కోడ్‌ను స్కాన్‌ చేస్తే విద్యార్థులకు ఆ పా ఠ్యాంశం కనబడుతుంది.

- Advertisement -

బడి బయట విద్యార్థులపై సర్వే
ఎంతో మంది పిల్లలు బడి మానేస్తున్నారు. కొందరు ఆర్థిక కారణాలతో చదువుకోవడం లేదు. దీంతో బడి బయట ఎంత మంది ఉన్నారని సర్వే చేపడుతున్నారు. గతంలో విద్యాశాఖ 6 నుంచి 14 సంవత్సరాల బడి బయట ఉన్న పిల్లలను గుర్తిం చేది. ప్రస్తుతం 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారి వివరాలను సేకరిస్తుంది. ఇందుకు సంబంధించి సీఆర్‌పీ లు గ్రామాల్లో తిరిగి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఎస్‌ఎస్‌ సీ, ఇంటర్‌, డిగ్రీ చదువులకు కొందరు నోచుకోవడం లేదు. వారు కూడా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసు కుంటున్నది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వివరాలను సేకరి స్తున్నారు. ఈ సర్వేలో ఉన్నత చదువులు చదవని వారి పేరు, ఊరు, తల్లిదండ్రులు, చదువు, వయస్సు, ఆధార్‌ సంఖ్య, మా తృభాష, చదువు మానేసిన కారణాలు ఇలా 28 రకాల వివ రాలను సేకరిస్తున్నారు. గత ఏడాది 2020-21 విద్యా సంవ త్సరంలో జిల్లా వ్యాప్తంగా 509 మంది బాలలు బడి బయట ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 6 నుంచి 14 సంవత్సరాల వారు 489, 15 నుంచి 19 ఏండ్ల విద్యార్థులు 20 మంది ఉన్నారు. వీరు ముఖ్యంగా భువనగిరి, బొమ్మలరామారం తదితర చోట్ల ఇటుక బట్టిలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సర్వే ఈ నెల 15వ తేదీన ముగియనుంది. అంతే కాకుండా సర్వేలో గుర్తించి న వారిని ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, అంబేద్కర్‌ ఓపెన్‌ యూని వర్సిటీ డిగ్రీలో ప్రవేశాలు తీసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఆసక్తి ఉన్న వారిని వృత్తి విద్యా కోర్సుల్లో చేర్పించనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ. 2వేల చొప్పున ఆర్థిక సహా యం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇలా చదువు కు న్న వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అర్హులు అవుతార ని ప్రభుత్వం ఆలోచన. వీరు కూడా సమాజంలో మంచి పౌ రులుగా ఎదిగేందుకు దోహదపడుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పుస్తకాలొచ్చినయ్‌
పుస్తకాలొచ్చినయ్‌
పుస్తకాలొచ్చినయ్‌

ట్రెండింగ్‌

Advertisement