e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home యాదాద్రి అంతా గప్‌చుప్‌

అంతా గప్‌చుప్‌

  • పకడ్బందీగా అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు
  • పట్టణాలు, పల్లెల్లో కొనసాగుతున్న పోలీస్‌ పెట్రోలింగ్‌, పికెటింగ్‌లు
అంతా గప్‌చుప్‌

ఆలేరు టౌన్‌, మే 19 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్నది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి మూసివేస్తున్నారు. 10గంటల తరువాత రోడ్లపైకి ఎవరూ రావడం లేదు. జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని ఎస్సై రమేశ్‌ కోరారు. అలాగే స్థానిక చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపడుతున్నారు. అత్యవసర వాహనాలను అనుమతిస్తున్నారు.
చౌటుప్పల్‌లో…
చౌటుప్పల్‌, మే 19 : మున్సిపాలిటీ పరిధిలో బుధవారం లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. అత్యవసర పనులున్న వారు ఉదయం 10గంటల లోపు బయటికొస్తున్నారు. అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాల ఎదుట భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 10గంటల తర్వాత బయటికి వస్తున్న వారికి పోలీసులు లాక్‌డౌన్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
రాజాపేటలో…
రాజాపేట, మే 19 : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ బుధవారం మండలంలో కొనసాగింది. లాక్‌డౌన్‌ సడలింపు వేళలో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు గడపదాటక పోవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
మోత్కూరు, గుండాల మండలాల్లో…
మోత్కూరు, మే 19: కొవిడ్‌ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ మోత్కూరు, గుండాల మండలాల్లో బుధవారం సంపూర్ణంగా జరిగింది. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో, గుండాల మండల కేంద్రంలో సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాలను వ్యాపారులు తెరిచి ఉంచారు. ఆ తర్వాత లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలు బయటకు రాకపోవడంతో పట్టణ, గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తుర్కపల్లిలో…
తుర్కపల్లి, మే 19:కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6నుంచి 10 గంటల వర కు వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకపోవడం తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
సంస్థాన్‌ నారాయణపురంలో…
సంస్థాన్‌ నారాయణపురం, మే 19 : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు ప్రజలు వారికి కావాల్సినవి తెచ్చుకుంటూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. పది గంటల తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనదారులు, నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని ఎస్‌ఐ సుధాకర్‌రావు హెచ్చరించారు.
ఆత్మకూరు(ఎం)…
ఆత్మకూరు(ఎం), మే 19: ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో బుధవారం ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటలకే వ్యాపారులు తమ దుకాణాలను మూసివేయడంతోపాటు గ్రామా ల ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో గ్రామాల్లోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
మోటకొండూర్‌లో…
మోటకొండూర్‌, మే 19 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మండల వ్యాప్తంగా బుధవారం కొనసాగింది. మండల కేంద్రంతోపాటు ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఉదయం 6 నుంచి 10 గంటల సడలింపు సమయంలో అవసరమైన సరుకులను, వస్తువులను కొనుగోలు చేశారు. బయటకు వచ్చే వాహనదారులకు లాక్‌డౌన్‌పై అవగాహనతోపాటు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.
అడ్డగూడూరులో…
అడ్డగూడూరు, మే 19 : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. ప్రజలు కూడా బయటకు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. అన్ని గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు.
రామన్నపేటలో…
రామన్నపేట, మే 19 : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6 నుంచి 10గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచడంతో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకుంటున్నారు. 10 గంటల తరువాత ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడంలేదు. దీంతో గ్రామాలతోపాటు మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అంతా గప్‌చుప్‌

ట్రెండింగ్‌

Advertisement