e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home యాదాద్రి పాడి సంపద పెరగాలి

పాడి సంపద పెరగాలి

  • రైతులు ఆ దిశగా దృష్టి సారించాలి g జనాభాకు సరిపడా లేని పాల ఉత్పత్తి
  • పశు సంపద పెంపునకు గోపాలమిత్రలు కృషి చేయాలి
  • శిక్షణ తరగతుల ప్రారంభంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ, ఆగస్టు3: రైతులు వ్యవసాయంతోపా టు పాడిరంగం వైపు దృష్టి సారించాలని, తద్వా రా మరింత ఆదాయాన్ని పొందొచ్చని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్యభవన్‌లో పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గోపాలమిత్రలకు నిర్వహించిన పునః శ్చరణ శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మా ట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 30లక్షల మంది జనాభా ఉండగా, పశు సంపద 5.50 లక్షలు మాత్ర మే ఉందని, అందులో 2.50 లక్షలు గేదెలు, ఆవుల నుంచి సుమారు 7.50 లక్షల లీటర్ల పాలు వస్తున్నా స్థానిక అవసరాలకు సరిపోవడం లేదన్నారు. జనాభాకు అనుగుణంగా ఇంకా పాడి పశువుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉండటం తో గోపాలమిత్రలు కృత్రిమ గర్భధారణపై రైతులను చైతన్యపరిచి వాటి ఉత్పత్తి పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో పాల ఉత్ప త్తి పెరిగి డిమాండ్‌ మేర సరఫరా సాధించొచ్చన్నారు.

ఆరోగ్యంగా జీవించేందుకు అమ్మ పాల తర్వాత ఆవు, గేదె పాలే మనిషికి ఎంతో దోహ దం చేస్తాయన్నారు. గత పాలకులు వ్యవసాయం తోపాటు పాడి రంగానికి ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో ఆ సమస్య తెలంగాణ రాష్ర్టాన్ని ఇంకా వెంటాడుతున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాడి రంగాభివృద్ధికి కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలను గోపాలమిత్రలతో నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మనిషి ఆరోగ్యం గా ఉండేందుకు పాలు ఎంతో అవసరమని, మన దగ్గర డిమాండ్‌ మేర సరఫరా లేకపోవడంతో కల్తీ జరుగుతున్నదన్నారు. ఆహారం, పాల ఉత్పత్తులు కల్తీ జరుగుతుండటంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండగా పాలు, కూరగాయలను మాత్రం పక్క రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. పాడి పశువులు లేకుంటే వ్యవసాయం లేదని అన్నారు.

- Advertisement -

హరితవిప్లవం పేరుతో రసాయన ఎరువుల వాడకం పెరిగి భూసారం బాగా దెబ్బతింటున్న ట్లు ఆయన తెలిపారు. నేడు ఆర్గానిక్‌ వ్యవసా యం చేసి అనేక మంది రైతులు రసాయన ఎరువులు వాడకుండానే మూడు రెట్ల దిగుబడి సాధిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 3.54 లక్షల పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించటం సంతోషకరమని, అయితే దూడలు పుట్టిన తర్వాత అవి ఆరోగ్యంగా ఉండేందుకు రైతులకు గోపాలమిత్రలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

ఉద్యోగులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ చిరు ఉద్యోగులకు కూ డా కనీస వేతనం రూ. 8500 చేయటంతో నేడు గోపాలమిత్రల వేతనం రూ.3500 నుంచి రూ. 8500 వరకు పెరిగిందని, అయితే ఇటీవల ప్రభు త్వం ప్రకటించిన పీఆర్సీ సైతం వారికి వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ కృత్రిమ గర్భధారణపై గోపాలమిత్రలు ఇంకా దృష్టి సారించి పశు సంపదను పెంచాలని సూచించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులే మన దగ్గర ఎక్కువగా ఉండటంతో వారికి వ్యవసాయంతోపాటు పాడి రంగంతో వచ్చే లాభాల గురించి అవగాహ న కల్పించి, వారిని ఆ రంగంవైపు దృష్టి సారించేలా చూడాలని సూచించారు. గోపాలమిత్రలకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు.

జిల్లా పశుగణాభివృద్ధి సంఘం అధ్యక్షుడు మోతె పిచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సీఈవో మంజువాణి, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల అధ్యక్షులు నాగేశ్వర్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, రాజలింగం, రైతుబంధుసమితి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రనాయక్‌, డీఎల్‌డీఏ ఏడీ మల్లికార్జున్‌, వెటర్నరీ జేడీ మల్లాది వెంకట సుబ్బారావు, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana