e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
  • నిరంతర కృషీవలుడు మంత్రి కేటీఆర్‌అంగరంగవైభవంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుక
  • ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

మోత్కూరు, జూలై 24: నిరంతర కృషివలుడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అని రాష్ట్ర ఆయి ల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు ను పురస్కరించుకుని మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జగ్జీవన్‌రామ్‌ చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను రామకృష్ణారెడ్డి కట్‌ చేసి ప్రజలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పెద్దచెరువు వద్ద మొక్కను నాటారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బొల్లేపల్లి వెంకటయ్య, రైతు సహకార సంఘం చైర్మన్‌ కంచర్ల అశోక్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ మేఘారెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ యా కుబ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్‌, కార్యదర్శి గజ్జి మల్లేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ మహమూద్‌, కౌన్సిలర్లు బొడ్డుపల్లి వెంకట య్య, పురుగుల వెంకన్న, కూరెళ్ల కుమారస్వామి, నర్సిం హ, ఆనందమ్మ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు, నాయకులు చింతల విజయభాస్కర్‌రెడ్డి, గోరుపల్లి సంతోష్‌రెడ్డి, జంగ శ్రీను, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మండల పార్టీ ఆధ్వర్యంలో..
మండలంలోని అనాజిపురం గ్రామంలో టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రైతువేదిక ఆవరణలో ఏర్పాటు చేసి న కేక్‌ను రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి కట్‌ చేశారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పొన్నేబోయి న రమేశ్‌, జడ్పీటీసీ గోరుపలిల శారదాసంతోష్‌రెడ్డి, రైతు సహకార సంఘం చైర్మన్‌ కంచర్ల రామకృష్ణాడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు, మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీ లక్ష్మీమారయ్య, సర్పంచ్‌ ఉప్పల లక్ష్మీయాదయ్య, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తీపిరెడ్డి మేఘారెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ కొణతం యా కుబ్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల కన్వీనర్‌ రాం పాక నాగయ్య, మాజీ సర్పంచ్‌ నిమ్మల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామా ల్లో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టారు.

- Advertisement -

అడ్డగూడూరులో..
అడ్డగూడూరు, జూలై 24: సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు ముక్కోటి వృక్షార్చనతో హరిత తెలంగాణ గా మార్చుదామని రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి నా యకులు, కార్యకర్తలు ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ మానవ మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నరేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, జిల్లా కో-ఆప్షన్‌ మెంబర్‌ జోసఫ్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్‌ఎస్‌ మం డల ప్రధానకార్యదర్శి చౌగోని సత్యంగౌడ్‌, మా ర్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ పూలపల్లి జనార్దన్‌రెడ్డి, దేవగిరి, మందుల కిరణ్‌, లక్ష్మణాచారి, బాలెంల అవినాశ్‌ పాల్గొన్నారు

వలిగొండలో..
వలిగొండ, జూలై 24: మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును శనివారం టీఆర్‌ఎస్‌ మండల పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పీహెచ్‌సీ ఆవరణలో, వ్యవసాయ మార్కె ట్‌ యార్డ్‌లో మొక్కలు నాటారు. మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆలయ ధర్మకర్తల మం డలి చైర్మన్‌ కిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ లు నిర్వహించి కొండపై మొక్కలు నాటారు. ఆ యా కార్యక్రమాల్లో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ కవిత, మమతానరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండరి, పట్టణ అధ్యక్షుడు రవీంద్ర, యూత్‌ అధ్యక్షుడు లింగస్వామి, శాంతికుమార్‌, మల్లారెడ్డి, సత్యనారాయణ, రాములు, శ్రీనివాస్‌, భిక్షపతి, శేఖర్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేటలో..
రామన్నపేట, జూలై24: మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకను శనివారం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం ముక్కో టి వృక్షార్చనలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నంద్యాల భిక్షంరెడ్డి, ఎంపీపీ జ్యోతీబలరాం, జడ్పీటీసీ లక్ష్మీజగన్‌మోహన్‌, సర్పంచ్‌లు శిరీశాపృథ్వీరాజ్‌, గుత్తా నర్సిరెడ్డి, ఎడ్ల హహేందర్‌రెడ్డి, అంతటి పద్మారమేశ్‌, అప్పం లక్ష్మీనర్సు, ఉప్పు ప్రకాశ్‌, కోళ్ల స్వామి, రాణి, మహేందర్‌రెడ్డి, సంధ్యాస్వామి, సిద్దమ్మయాదయ్య, ఎంపీటీసీలు మహేందర్‌రెడ్డి, రేహాన్‌, నర్సింహ, పారిజాత, ఆమేర్‌, ఉదయ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

వృద్ధులకు చేతి కర్రల పంపిణీ
వలిగొండ, జూలై 24: మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా సంగెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను సర్పంచ్‌ కీసరి రాంరెడ్డి కట్‌ చేశారు. అనంతరం 50 మంది వృద్ధులకు పీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో శని వారం చేతి కర్రలను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్‌ కాసుల కృష్ఱ, ఉండాడి సత్యనారాయణ, వరికుప్పల మల్లేశం, గోగు లిం గంయాదవ్‌, చంద్రారెడ్డి, లింగస్వామి, కాసుల మల్లేశం, జక్కల వెంకటేశం పాల్గొన్నారు.

ఫ్లోరోసిస్‌ బాధితులకు ఆర్థికసాయం
చౌటుప్పల్‌, జూలై 24: ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మున్సిపా లిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్‌ బాధితులు సంధ్య, రేణులకు డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పిల్లమర్రి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం రూ. 10వేల ఆర్థిక సాయాన్ని గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా అం దజేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ జిల్లా మెంబర్‌ చంద్రకిరణ్‌, మల్లేశ్‌గౌడ్‌, వెంకటేశ్‌యాదవ్‌, అమర్‌, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

మొక్కను నాటిన తహసీల్దార్‌
చౌటుప్పల్‌, జూలై 24: ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్‌ గిరిధర్‌ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీ మమత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి అర్బన్‌లో..
భువనగిరి అర్బన్‌, జూలై 24: మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా పట్టణంలోని పార్కులో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, పట్టణంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మండలంలోని మన్నెవారిపంపు గ్రామంలో సర్పంచ్‌ పాండు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో భువనగిరి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, వా ర్డు కౌన్సిలర్‌ చెన్న స్వాతీమహేశ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, డైరెక్టర్లు రాంరెడ్డి, కేశవరెడ్డి, రమేశ్‌, భిక్షపతి, పుండరీకం, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana