e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home యాదాద్రి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

  • జిల్లాస్థాయి సంఘాల సమావేశంలో జడ్పీచైర్మన్‌ సందీప్‌రెడ్డి
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

భువనగిరి అర్బన్‌, జూన్‌ 14 : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. జిల్లాస్థాయి సంఘాల సమావేశం పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవా రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు త్వరగా పూర్తి అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నా రు. వర్షాకాలం నేపథ్యంలో రైతులకు విద్యుత్‌ అం తరాయం లేకుండా చూడాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షం నీరు వృథా కా కుండా చెరువులు, కుంటల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని, వర్షాలు పడే ముందే చెరువులు, కుం టలు, తెగిన కాలువల ఉంటే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. చెరువులు, కుంటలు నిండితే భూగర్భ జలాలు పెరిగి అధిక శాతం భూమి సాగులోకి వస్తుందన్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఆవాస ప్రాంతాలకు కృష్ణా నీటిని సక్రమంగా అందించాలని జడ్పీ చైర్మన్‌ అధికారులకు సూచించారు.

ప్రధానంగా అన్ని మండలాలకు అంతర్గత పైపులైన్‌ పనులను పూర్తి చేయాలని, ఎక్కడైనా వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులు మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న గ్రామ పంచాయతీలను పూర్తి చేయాలన్నారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉపాధి హామీ పనిదినాలను పెంచి అందరికీ పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బీక్కూనాయక్‌, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు మందడి ఉపేందర్‌రెడ్డి, శ్రీలక్ష్మి, నాగేంద్ర, లక్ష్మణ్‌, శంకరయ్య, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement