e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home యాదాద్రి సాగర్‌ జనమంతా టీఆర్‌ఎస్‌ వైపే

సాగర్‌ జనమంతా టీఆర్‌ఎస్‌ వైపే

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

సాగర్‌ జనమంతా టీఆర్‌ఎస్‌ వైపే

యాదాద్రి, ఏప్రిల్‌10: నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భాగంగా నియోజకవర్గంలోని నిడమనూరు మండలం ముకుందాపురంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో లాండ్రీ షాపు వద్దకు వెళ్లి ఇస్త్రీ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కుమార్‌కు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్న నేపథ్యంలో కారు గుర్తుకే ఓటేస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. నోముల భగత్‌ భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు పాల్గొన్నారు.

సాగర్‌లో ఆలేరు టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం
ఆలేరు టౌన్‌, ఏప్రిల్‌ 10 : నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నిడమనూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ను గెలిపించాలని కోరుతూ ఆలేరుకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, నాయకులు గంగుల శ్రీనివాస్‌, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బక్క రాంప్రసాద్‌, చిమ్మి శివమల్లు, ఆరె మల్లేశం, బైరి మహేందర్‌, మామిడాల నర్సింహులు, మామిడాల అంజయ్య, భాను, గుర్రాల బాలరాజు, పరశురాములు, సతీశ్‌ అంజయ్య, రియాజ్‌,గఫూర్‌, నాగరాజు, టింకు పాల్గొన్నారు.

తుర్కపల్లిలో..
తుర్కపల్లి, ఏప్రిల్‌ 10: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ గెలుపు కోసం శనివారం టీఆర్‌ఎస్‌ మండల నాయకులు ప్రచారం చేశారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముందాపురంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ భిక్కూనాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ కొమిరిశట్టి నర్సింహులు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌యాదవ్‌, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, నాయకులు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జక్కుల వెంకటేశ్‌, చత్రునాయక్‌, మగ్తా, రాంజీ, పాండు, అయిలయ్య పాల్గొన్నారు.

మోటకొండూర్‌ నాయకుల ప్రచారం
మోటకొండూర్‌, ఏప్రిల్‌ 10: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం మోటకొండూర్‌ మండల జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి భగత్‌ సతీమణి భవానితో కలిసి మండల నాయకులు నిడమనూరు మండలం వల్లభాపురంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ బురాన్‌, నాయకులు బండి సాయికుమార్‌, పోలెపల్లి స్వామి, భూమండ్ల పరశురాములు, వీరనర్సింహ్మ, కొండ మహేశ్‌, రాంబాబు పాల్గొన్నారు.

ప్రచారానికి తరలిన టీఆర్‌ఎస్‌ నాయకులు
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్‌ 10: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ గెలుపు కోసం మండలం నుంచి శనివారం టీఆర్‌ఎస్‌ నాయకులు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని నిడమనూరుకు తరలివెళ్లారు. ప్రచారానికి వెళ్లిన వారిలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉప్పలయ్యతో పాటు జిల్లా, మండల నాయకులు నర్సింహారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ధనలక్ష్మి, అరుణ, వెంకన్న, శేఖర్‌, సత్తయ్య, శంకర్‌ ఉన్నారు.

జోరుగా ప్రచారం
గుండాల, ఏప్రిల్‌ 10: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ గుండాల నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం నిడమనూరులో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో భగత్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ, ప్రధాన కార్యదర్శి మూగల శ్రీనివాస్‌, గడ్డమీది మహోదయ్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ గడ్డమీది పాండరి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు గూడ రవీందర్‌, యూత్‌ నాయకులు ఓడపల్లి మధు, అట్ల రంజిత్‌రెడ్డి, వంగూరి అనిల్‌, కొమ్మగళ్ల దయాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
సాగర్‌ జనమంతా టీఆర్‌ఎస్‌ వైపే
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement