e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home యాదాద్రి కరోనా బాధితులకు అండగా ఉందాం

కరోనా బాధితులకు అండగా ఉందాం

కరోనా బాధితులకు అండగా ఉందాం

మోటకొండూర్‌, మే 30: కరోనా కట్టడిలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ పాత్ర అమోఘమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్యయాదవ్‌ పేర్కొన్నారు. కరోనా నివారణకు సీఎం కేసీ ఆర్‌ రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజలంతా కరో నాను అంతం చేయడానికి కలిసికట్టుగా ఉండాలన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యుడు బ డుగుల లింగయ్యయాదవ్‌ సహకారంతో స్థానిక పీహెచ్‌సీకి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌, వీల్‌చైర్‌, స్ట్ట్రెచర్‌ పలు సామగ్రిని వైద్య సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా ఆపత్కాలంలో పైసలు ముఖ్యం కా దు ప్రజల ప్రాణాలే ముఖ్యం అని చెప్పిన గొప్ప మనస్సున వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. ఇంతా విపత్కర పరిస్థితిలోనూ నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆ ర్‌ను ప్రతిపక్ష నాయకులు విమర్శించడం సరికాదన్నా రు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న వ్యాక్సినేషన్‌ చేపట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్‌, కేటీఆర్‌లు ఉన్నారన్నారు.

ప్రజలంతా అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.స్థానిక పీహెచ్‌సీ లోని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అదేవిధంగా పల్లెలలో ప్రగతి తేవాలనే సంకల్పం తోనే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయం గా చేపట్టారన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒ క్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు చూడాలన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఎలాంటి సంక్షేమమైన చేయగల సత్తా ఉన్న నాయకురాలు ప్రభుత్వ విప్‌ సునీత అని రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌ కితాబునిచ్చారు. పీహెచ్‌సీకి కొవిడ్‌ బాధితుల సౌకర్యార్థం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌, వీల్‌ చైర్‌, స్ట్రెచర్‌ మొదలగు సామగ్రిని అందించిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌కి ప్రభుత్వ విప్‌ గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపా రు.

రానున్న కాలంలో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ప్రభుత్వ విప్‌ కోరా రు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీ ది రవీందర్‌గౌడ్‌, ఎంపీపీ పైళ్ల ఇందిర, జడ్పీటీసీ పల్లా వెం కట్‌రెడ్డి, మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌, సర్పంచ్‌ వడ్డెబోయిన శ్రీలత, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, కో ఆప్ష న్‌ సభ్యుడు ఎండీ బురాన్‌, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ అయిలయ్య, టీఆర్‌ఎస్‌ మహిళా మండల అధ్యక్షురాలు బొలగాని నాగమణి, టీఆర్‌ఎస్‌ మండల సెక్రటరీ జనరల్‌ నర్సింగ్‌యాదవ్‌, యువజన విభాగం మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు, మండల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆక్సిజన్‌కు ఎంతో ప్రాధాన్యం
ఆలేరు టౌన్‌: ప్రస్తుత కరోనా సమయంలో ఆక్సిజన్‌కు ఎం తో ప్రాముఖ్యత ఉందని ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆలేరులోని కమ్యూని టీ హెల్త్‌ సెంటర్‌కు హైదరాబాద్‌ బ్రీత్‌ ఇండియా వారు ఆది వారం ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమ క్షంలో రూ. లక్షా 65వేల విలువవైన 3 ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఈ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు నిరంతరం అందుబాటు లో ఉండేలా చూడాలన్నారు. బ్రీత్‌ ఇండియా వారు దవా ఖానకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఆపద సమయంలో ఇలాంటి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

ఈ సందర్భంగా వారికి ఆసుపత్రి తరపున అభినందన పత్రాన్ని అందజేశా రు. అనంతరం డయాలసిస్‌ సెంటర్‌లో రోగులకు అందు తున్న సేవలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, పీఎసీఎస్‌ చైర్మన్‌ మల్లేశం, బ్రీ త్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్‌, శ్రీమాన్‌, ఇందర్‌జైన్‌, వైద్యులు క్రాంతికిరణ్‌, ప్రసాద్‌రావు, శ్రీనివా స్‌,కౌన్సిలర్లు రాములు, నర్సింహులు, శ్రీకాంత్‌, పట్టణ టీ ఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వెంకటేశ్‌, రవి, శివమల్లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా బాధితులకు అండగా ఉందాం

ట్రెండింగ్‌

Advertisement