e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు మేడిపల్లికి మహర్దశ

మేడిపల్లికి మహర్దశ

మేడిపల్లికి మహర్దశ

పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు
పూర్తైనవైకుంఠధామం,కంపోస్ట్‌ షెడ్‌ పనులు
కళకళలాడుతున్న పల్లె ప్రకృతివనం
చెత్త సేకరించి డంపింగ్‌ యార్డ్‌ కు తరలింపు

బొమ్మలరామారం, ఏప్రిల్‌ 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామం అభివద్ధిలో దూపుకుపోతున్నది. గ్రా మంలో జనాభా 1098 ఉండగా 691 మంది ఓటర్లు ఉ న్నారు. ఇందులో పురుష ఓటర్లు 359 మంది, మహిళా ఓటర్లు 332 మంది ఉన్నారు. గ్రామస్థులు, పాలకవర్గ స భ్యులు, అధికారులు సహకారంతో సర్పంచ్‌ సుర్వి గో వింద్‌ గౌడ్‌ గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి తాగునీటి సమస్యను తీర్చారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం, సీసీ రోడ్లు, 30 రోజుల ప్రణాళికలో డపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, నర్సరీలను ఏర్పాటు చేశారు.17 పాత ఇండ్లను కూల్చివే శారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పరంగా కేటాయిస్తున్న నిధులు సద్విని యోగం చేసుకొంటూ మండలంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
రూ.38.5లక్షలతో అభివృద్ధి పనులు
గ్రామంలో 38.5లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్‌తో పాటు ఇతర పరికరాలు కొనుగోలు చేశా రు. ఇంటింటికీ తడి,పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామస్థులు తప్పనిసరిగా తడి, పొడి చెత్తను వేరు చేసి ట్రా క్టర్‌లో వేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు సేక రించిన చెత్తను ట్రాక్టర్‌ ద్వారా డంపింగ్‌ యార్డ్‌కు తరలిం చి ఎరువుగా మార్చుతున్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ , ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు.
చెక్‌ డ్యాం నిర్మాణంతో పెరగనున్న సాగు విస్తీర్ణం
గ్రామానికి అనుకొని ఉన్న శామీర్‌పేట వాగుపై పెద్ద తాళ్ల దుబ్బ వద్ద ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీ తా మహేందర్‌ రెడ్డి చొరవతో మంజూరైన రూ.3కోట్ల 88 లక్షలతో చెక్‌ డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తైతే 95 ఎకరాలు అదనంగా సాగులోకి రావడం తో పాటు భూగర్భజల మట్టం పెరుగుతుంది.
తీరిన వైకుంఠధామ సమస్య
గ్రామంలో వైకుంఠధామానికి సరైన స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు దాత చిదురుప్ప హనుమంత రెడ్డి 21గుంటల భూమిని దానం గా ఇవ్వడంతో వైకుంఠధామం నిర్మాణం పూర్తిచేశారు. దీంతో ప్రజల ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేడిపల్లికి మహర్దశ

ట్రెండింగ్‌

Advertisement