e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

జిల్లాలో 16వ రోజు ప్రశాంతం
ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
నిర్మానుష్యంగా ప్రధాన, అంతర్గత రోడ్లు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : కొవిడ్‌ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ 16వ రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 10 గంటల తర్వాత వాహనాలు, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సమయంలోనే ప్రజలు బయటకు వచ్చి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి లాక్‌డౌన్‌కు సహకరిస్తుండటంతో పల్లెలు, పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారులు కూడా 10 గంటలలోపే తమ వర్తక, వ్యాపారాలను మూసివేశారు.
బీబీనగర్‌, మే 27 : జిల్లాలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్నదని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. ఉదయం 10 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధ్దంగా తిరుగుతున్న 30 వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ మా స్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఆయన వెంట ఏసీపీ భుజంగరావు, సీఐ జానయ్య, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.
చౌటుప్పల్‌ రూరల్‌, మే27 : మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టును గురువారం భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌ సందర్శించారు. ఈ సం దర్భంగా లాక్‌డౌన్‌ అమలు తీరును ఆయన అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రజలు నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట ట్రాఫిక్‌ సీఐ ముని, సిబ్బంది రాజేందర్‌, వినోద్‌, శ్రీను, వెంకన్న ఉన్నారు.
మోత్కూరు, మే 27: మోత్కూరు, గుండాల మండలాల్లో లాక్‌డౌన్‌ 16వ రోజు గురువారం కట్టుదిట్టంగా జరిగింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో , మున్సిపాలిటీ కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. భువనగిరి, నల్లగొండ, తిరుమలగిరి దారుల నుంచి రాకపోకలను సాగిస్తున్న వాహనాలను ఆపి గుర్తింపు కార్డు లు, మినహాయింపు ఉన్న వారిని అనుమతించా రు. గుండాల మండల కేంద్రంలో జనగామ, దేవరుప్పుల, మోత్కూరు, ఆలేరు ప్రాంతాల నుంచి రాకపోకలను సాగిస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని బైక్‌లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు అధిక సంఖ్యలో షాపుల ఎదుట నిత్యావసరాల కోసం బారులు తీరారు. 10 గంటలు దాటిన తర్వాత షాపులను మూసి వ్యాపారులు లాక్‌డౌన్‌కు సహకరించారు.
రాజాపేట, మే 27 : మండలంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో మండలం, గ్రా మాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారా యి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు వేళల్లో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసరా లను కొనుగోలు చేశారు.
ఆలేరు టౌన్‌, మే27 : ఆలేరు పట్టణంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేశ్‌ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామన్నారు. ఉదయం10లోపు వ్యాపారులు తమ షాపు లను మూసివేయాలన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పదన్నారు.
తుర్కపల్లి, మే27 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో లాక్‌డౌన్‌ 16వ రోజు ప్రశాంతంగా జరిగింది. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో పోలీస్‌లు చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్‌ఐ మధుబాబు ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డుపైకి వచ్చిన వాహనాలకు చలనాలు విధించారు.
యాదాద్రి, మే27: యాదగిరిగుట్ట పట్టణంలో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా సాగింది. సడలింపు సమ యంలో మాత్రమే ప్రజలు రోడ్లపైకి వచ్చి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఉదయం నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. అత్యవసర సేవలతోపాటు మినహాయింపు వారిని రోడ్లపై అనుమతించారు. దీంతో యాదగిరిగుట్ట పట్టణ రహదారులు, ఆర్టీసీ ప్రయాణ ప్రాం గణం బోసిపోయింది.
సంస్థాన్‌ నారాయణపురం, మే27: మండలంలో లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారు. ఉదయం 6గంటలకు వ్యాపారులు షాపులు తెరిచి 10 గంటల లోపు మూసివేశారు. పదితర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా మారా యి. ఎస్‌ఐ సుధాకర్‌రావు ఆధ్వర్యంలో గుడిమల్కాపు రం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వ హించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారు.
చౌటుప్పల్‌, మే 27 : చౌటుప్పల్‌లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 లోపు తమ పనులు పూర్తిచేసుకున్న ప్రజలు ఆ తర్వాత ఇండ్లలోనే ఉన్నారు. వాహనాలతో రద్దీగా ఉండే చౌటుప్పల్‌ జాతీయ రహదారి, సర్వీస్‌ రోడ్లు, కూరగాయల మార్కెట్‌ ప్రాంగణం బోసిపోయాయి. ఏసీపీ సత్తయ్య పర్యవేక్షణలో లాక్‌డౌన్‌ను సీఐ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ ముని పరిశీలించారు. ఆ కారణంగా జాతీయ రహదారిపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్‌చేశారు.
రామన్నపేట, మే27: ప్రభుత్వం కొవిడ్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ మండలంలో ప్రశాంతంగా జరుగుతున్నది. 10 గంటల్లోపే వ్యాపారులు తమ షాపులను మూసివేయడంతో ప్రజలు బయటకు రావడంలేదు. దీం తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. పోలీస్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్‌ఐ చంద్రశేఖర్‌ వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఆత్మకూరు(ఎం), మే27: లాక్‌డౌన్‌ నిబం ధనలను పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ ఐ ఎండీ.ఇద్రిస్‌ అలీ హెచ్చరించారు. గురు వారం మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పెట్రోలింగ్‌ నిర్వహించి ఆయా గ్రామాల ప్రజలకు లాక్‌డౌన్‌ నిబంధనల పై అవగాహన కల్పించారు. ఉదయం 10 తర్వాత బయటకు రావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడంతో పాటు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు.
అడ్డగూడూరు, మే 27 : మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ 16వరోజు ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారులు తమ షాపులను మూసివేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పైకి వచ్చిన ఐదు వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసి 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పకడ్బందీగా లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement