e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home యాదాద్రి కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

రామన్నపేట, మే 25: కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళ వారం మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితుల ఇం డ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుం కుడుపాముల మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటాచారి మూ డు రోజుల క్రితం మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సూరారం గ్రామంలో గండిపడిన ఆసిఫ్‌ నహర్‌ కాల్వను పరిశీలించి ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడా రు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశం, అక్రం, సుధాకర్‌, ప్రసాద్‌, శేఖర్‌, విష్ణు, రమేశ్‌, పిచ్చిరెడ్డి, సాయి, అజర్‌, శ్రీకాంత్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయాలి
మోత్కూరు(గుండాల) : కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రజా ప్ర తినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీ డీవో గార్లపాటి శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల పరిధిలోని పాచిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో కోవిడ్‌ ఐసోలేషన్‌ ఏర్పాటు కోసం రెండు గదులను ఆ యన పరిశీలించి మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొ విడ్‌ పాజిటివ్‌ సోకిన వ్యక్తులకు ఇంట్లో సరైన వసతులు లేని వారు ఐసోలేషన్‌లో వసతి పొందాలన్నారు. ప్రభుత్వ వైద్యధి కారుల ప్రత్యేక వైద్యం, భోజనం వంటి మెరుగైన ఆహార పదా ర్థాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల లోని రెండు గదులను పరిశీలించి శుభ్రం చేయించి, హైపోక్లో రైట్‌ ద్రావణం చల్లించి, బ్లీచింగ్‌ చేయించినట్లు తెలిపారు. కా ర్యక్రమంలో జడ్పీ కో అప్షన్‌ సభ్యుడు ఎండీ ఖలీల్‌, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, మండల వైద్యధికారి శ్రీనివాస్‌, సర్పంచ్‌ రేఖ, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌ పాల్గొన్నారు.

సోడియం హైపోక్లోరైట్‌ పంపిణీ
మోత్కూరు, అడ్డగూడూరు మండలాల పరిధిలోని ఆయా గ్రామాలకు హైపోక్లోరైట్‌ ద్రావణం, బ్లీచింగ్‌ పౌడర్లను ప్రముఖ ప్రారిశ్రామికవేత్త, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మినర్సింహ్మరెడ్డి అందజేశారు. మంగళవారం మండలంలోని పాటిమట్ల, సద ర్శాపురం, దాచారం గ్రామాలకు అందజేశారు. పాటిమట్ల లోని తన ఇంటివద్ద హైపోక్లోరైట్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ ఉచితంగా అంది స్తానని ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు తీసుకెళ్లాలని కో రారు.కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లేశ్‌, యాదగిరి పాల్గొన్నారు

బీర్ల పౌండేషన్‌ ఆధ్వర్యంలో..
మండలంలోని మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన పాలడుగు రాములు అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం ఆ యన కుటుంబానికి బీర్లపౌండేషన్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ ఏళ్ల రాంరెడ్డి రూ.5వేల సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎం పీటీసీ అనిత, యాదగిరి, అయిలయ్య, చంద్రకళ, నర్సయ్య, కోండయ్య తదితరులు పాల్గొన్నారు.

భోజన ప్యాకెట్లు అందజేత
భువనగిరి టౌన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని యాచకు లకు, పేదలకు, బస్సు, రైల్వేస్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణి కులకు ప్రముఖ వ్యాపార వేత్త అవేస్‌చిస్తి భోజన ప్యాకెట్లను అందజేశారు. అదే విధంగా 20వ వార్డులో కరోనా బాధితుల కు పచ్చల జగన్‌మోహన్‌ నిత్యావసర సరుకులను అందజేశా రు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అవరణలో చెట్ల కింద నివాస ముంటున్న పేదలకు సురుపంగ చందు భోజన ప్యాకెట్లను అం దజేశారు. ఆయా కార్యక్రమాల్లో 20వ వార్డు పెద్దలు కూర వెంకటేశ్‌, ముత్తు, ఆవుల వినోద్‌, నవీన్‌, బీష్మ, నాజిమా సలా వుద్దీన్‌, బర్రె సురేశ్‌, అలీం తదితరులు పాల్గొన్నారు.

మాస్కులు పంపిణీ
ఆలేరు టౌన్‌ : ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత, డీసీ సీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలేరులో మంగళవారం పారిశుద్య కార్మికు లకు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాధవి, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్య క్షుడు వెంకటేశ్‌ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.కార్యక్ర మంలో లక్ష్మి, నర్సయ్య, మల్లేశ్‌, బాలమణి పాల్గొన్నారు.
సంస్థాన్‌ నారాయణపురం: మండల పరిధిలోని అంగోతు తం డా, పొర్లగడ్డ తండా గ్రామాల్లో లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదావత్‌ లచ్చిరాం నాయక్‌ మంగళ వారం 500మంది గిరిజనులకు మాస్కులు పంపిణీ చేశారు.

మానసిక వికలాంగులకు సరుకులు పంపిణీ
వలిగొండ: మండల పరిధి టేకులసోమారంలోని సాధన మా నసిక వికలాంగుల ఆశ్రమంలోని మానసిక వికలాంగులకు చిరాగ్‌ ఫౌండేషన్‌ (అమెరికా) సౌజన్యంతో జిల్లా ఆర్యవైశ్య మ హాసభ ఆధ్వర్యంలో 11వేల రూపాయల విలువైన నిత్యావస ర సరుకులను మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఇరుకుళ్ల రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు మల్లగిరి శ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సాధన మానసిక వికలాంగుల సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు అందజేత
ఆత్మకూరు(ఎం): ప్రభుత్వవిప్‌, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునితామహేందర్‌రెడ్డి పెళ్లి రోజును పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని పది మంది కరోనా బాధి త కుటుంబాలకు రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మ న్‌ గడ్డం దశరథ గౌడ్‌ పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల యూత్‌, సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షుడు శేఖర్‌, కృష్ణస్వామి, సతీశ్‌, మల్లేశ్‌, యాదగిరి, సాయి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి

ట్రెండింగ్‌

Advertisement