ఆలేరు టౌన్, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధి స్తుందని ఎస్‌ఆర్‌కేవీ ప్రధానోపాధ్యాయుడు, యోగా గురువు బండిరాజుల శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన యోగా తరగతు లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా ఒంట్లో రోగనిరోధక శక్తి, ప్రాణవా యువు పెరుగుతుందన్నారు. రోజూ యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు. కార్యక్రమంలో జహాంగీర్, సుభాశ్, రాజు, దశరథ, రాజు, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో..
బీబీనగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ఎయిమ్స్‌లో డైరెక్టర్ వికాస్ భాటియా, డీన్ డాక్టర్ రాహుల్ నారంగ్, కల్నల్ అనంతరావు, వైద్యులు, విద్యార్థ్దులతో కలసి ఎయిమ్స్ ఆవరణలో యోగాసనాలు వేశా రు.ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిరంతరం ఉరుకులు పరుగుల జీవితంలో మన శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి లో నవుతున్నాయని, అలాంటి వాటి నుంచి యోగా చేయడం ద్వా రా ఉపశమనం పొందవచ్చునన్నారు.
యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం
భువనగిరి టౌన్: యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం లభి స్తుందని లక్ష్మీ నరసింహస్వామి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాకో టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం కళాశాలలో రవిశంకర్ గు రూజీ శిష్యుడు శ్రీనివాస్ గురూజీ సమక్షంలో ఎన్ఎస్ఎస్ 1, 2, 3 యూనిట్స్ కేడెట్ల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్సీసీ కేడెట్లు బీ విత్ యోగా బీ ఎట్ హోం నినాదంతో యోగాసనాలు వేశారు. అనంతరం మినిస్ట్రీ ఆఫ్ ఆ యుష్ దేశవ్యాప్తంగా నిర్వహించిన యోగా ప్లెడ్జ్ టేకింగ్, ఆన్లై న్లో నిర్వహించిన యోగా క్విజ్ పోటీల్లో 45 మంది కేడెట్లు పాల్గొని ఆన్లైన్లో సర్టిఫికెట్లు పొందారు.కార్యక్రమంలో ఎన్సీ సీ ఆఫీసర్ బోడ జగన్నాధ్, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాండురంగం, సుధ, పాండు, కృష్ణ, రాజు, రాజశేఖర్, ప్రేమ్, మహేశ్ పాల్గొన్నారు.
బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో
పట్టణంలోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో యోగా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి చంద్ర అక్కయ్య, రామేశ్వర్ మాట్లా డుతూ భారతదేశం యొక్క ప్రాచీనశాస్త్రం యోగా అన్నారు. కా ర్యక్రమంలో బ్రహ్మకుమారీలు జయప్రకాశ్, బాలేశ్వర్, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, ముత్తిరెడ్డి, విజయలక్ష్మి, మనోహర్, నరేందర్, జ హంగీర్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.అదేవిధంగా పట్టణం లోని సబ్‌జైలులో సబ్ జైలర్ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో ఖైదీలతో యోగసనాలు వేయించారు.