e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home యాదాద్రి సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి

సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి

సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి

భువనగిరి టౌన్‌, మే 20 : చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తా యని భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయు లు అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త త ల్లం కృష్ణ విజయ, డోగిపర్తి శ్రీధర్‌ సహకారంతో పట్టణంలోని యాచకులకు, పేదలకు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో నిలిచిపో యిన ప్రయాణికులకు భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. అదేవిధంగా పట్ట ణంలోని పేదలకు, యాచకులకు దళిత నేత ఇటుకల దేవేందర్‌ భోజన ప్యాకెట్లను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్‌ఐ శేఖర్‌, కౌన్సిలర్లు ప్రమోద్‌కుమార్‌, స్వాతి, నర్సింహా, నాయ కులు జహంగీర్‌, హరిప్రసాద్‌, శ్రీనివాస్‌, సంకీర్త్‌, మనోజ్‌, కృష్ణ, నరేశ్‌ పాల్గొన్నారు.

పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం
భూదాన్‌పోచంపల్లి: కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పారిశుధ్యం విషయంలో కట్టు దిట్టమై న చర్యలు చేపడుతున్నామని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి అన్నారు. గురువారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లో రైట్‌ దావ్రణాన్ని పిచికారీ చేయించారు.

వీఆర్‌ఏలకు నిత్యావసరాలు అందజేత
ఆత్మకూరు(ఎం): విధి నిర్వహణలో భాగంగా కరోనా భారిన పడిన మండల కేంద్రంతో పాటు పల్లెపహడ్‌, పారుపల్లి గ్రామా లకు చెందిన వీఆర్‌ఏ కుటుంబాలకు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఉద్యోగులు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ జయలక్ష్మి, ఆర్‌ఐ. యాద గిరి, సీనియర్‌ అసిస్టెంట్‌ పాండు, వీఆర్వోలు కనకయ్య, రంజాన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రమేశ్‌, వీఆర్‌ఏలు కృష్ణ, గణేశ్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

తుక్కాపురంలో చికెన్‌ పంపిణీ
మండలంలోని తుక్కాపురంలో కరోనా బారిన పడ్డ 16 కు టుంబాలకు ఎంపీటీసీ దుంప వేంకటేశ్‌ సహకారంతో సర్పంచ్‌ రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు చికెన్‌ను గురువారం ఇంటింటికీ తిరిగి అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండ ల కమిటీ సభ్యులు రవి, నాగరాజు, నరేశ్‌, కిషన్‌ పాల్గొన్నారు.

కరోనా బాధితులను ఆదుకోవాలి
సంస్థాన్‌ నారాయణపురం:కరోనాతో బాధ పడుతున్న పేద ప్రజలను స్వచ్ఛంద సంస్థలు,దాతలు ఆదుకోవాలని ఏసీపీ స త్తయ్య అన్నారు.మండలంలోని పుట్టపాక గ్రామంలో కరోనా బారిన పడి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న 20 మందికి దిశ ఫౌండేషన్‌ సహకరంతో నిత్యావసర సరుకులను,మందులను ఆయన గురువారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ వెం కటయ్య, ఎస్‌ఐ సుధాకర్‌రావు, సర్పంచ్‌ సామల భాస్కర్‌, ఎంపీటీసీ వసంత, మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోడిగుడ్లు పంపిణీ
చౌటుప్పల్‌: మున్సిపాలిటీ కేంద్రంలోని 10వ వార్డులో కరో నాతో బాధ పడుతున్న వారి కుటుంబ సభ్యులకు విశ్రాంతి ఉద్యోగుల సంఘం మండల కమిటీ సహకారంతో వార్డు కౌన్సి లర్‌ బొడిగె అరుణ గురువారం కోడిగుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణగౌడ్‌, విశ్రాంతి ఉద్యోగు ల సంఘం సభ్యులు మోహన్‌రెడ్డి, రాజయ్య, పాండుచారి, శం కరయ్య, వెంకటయ్య, ఆగయ్య, నర్సింహరావు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి

ట్రెండింగ్‌

Advertisement