e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home యాదాద్రి ఇచ్చిన మాటకు కట్టుబడి

ఇచ్చిన మాటకు కట్టుబడి

ఇచ్చిన మాటకు కట్టుబడి
  • 22వ తేదీన వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌
  • గ్రామానికి వస్తానని సర్పంచ్‌కు స్వయంగా సీఎం కేసీఆర్‌ ఫోన్‌
  • గ్రామస్తులతో కలిసి సామూహిక భోజనం, గ్రామసభ
  • గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలోనే హామీ
  • సీఎం కేసీఆర్‌ రాకపై సంబురపడిపోతున్న గ్రామస్తులు

యాదాద్రి భువనగిరి, జూన్‌ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్‌ ఈనెల 22వ తేదీన వాసాలమర్రి గ్రామానికి వస్తున్నారు. గతంలోనే ఊరికి రావాల్సి ఉండగా..సీఎంకు కొవిడ్‌ పాజిటివ్‌ రావడం.. లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. వాసాలమర్రిని దత్తత తీసుకుని నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ తరహా లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. గతేడాది అక్టోబర్‌ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద సీఎం కేసీఆర్‌ కొద్దిసేపు ఆగారు. ఊరి సమస్యల ను స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మరుసటి రోజే గ్రామస్తులను ఫాంహౌజ్‌ కు పిలిపించుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్‌ వివి ధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి వాసాలమర్రి సమగ్రాభివృద్ధ్దికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పది, పదిహేను రోజుల్లో వాసాలమర్రికి వచ్చి గ్రామస్థులతో సహపంక్తి భోజనం కూడా చేస్తానని మాటిచ్చారు. అయితే కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సీఎం పర్యటనకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. తాజాగా ..సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి సర్పంచ్‌ పోగుల ఆంజనేయులుకు ఫోన్‌ చేసి వాసాలమర్రికి ఈనెల 22న వస్తున్నట్లు చెప్పారు.

అంకాపూర్‌ తరహాలో అభివృద్ధి పర్చేందుకు ప్రణాళిక..
గతంలో సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామ సమస్యలపై స్థానిక సర్పంచ్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులతో చర్చించిన సందర్భంలో అంకాపూర్‌కు దీటుగా గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. అవసరమైతే రూ.100కోట్లు వెచ్చించైనా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేలా చూసి ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. గ్రామంలోని మైసోనికుంటను సిద్దిపేట జిల్లాలోని కోమటికుంట తరహాలో అందంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమగ్రాభివృద్ధ్దికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించడంతో ఈ మేరకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులతోపాటు, జిల్లా అధికారులు వాసాలమర్రిలో ఇంటింటి సర్వే నిర్వహించి అభివృద్ధ్దితోపాటు, ఉపాధి అవకాశాలకు సంబంధించి బ్లూప్రింట్‌ను రూపొందించి సిద్ధం చేసి ఉంచారు. అంకాపూర్‌ రైతులు అవలంభిస్తున్న వ్యవసాయ పద్ధ్దతులను చూసి రావాలని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో 270 మంది గ్రామస్తులు పది బస్సుల్లో అంకాపూర్‌ను సందర్శించి వచ్చారు. గ్రామంలో విద్యుద్ధ్దీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.3.15కోట్లను మంజూరు చేసింది. దీంతో రూ.2.65 కోట్లతో 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను, రూ.50 లక్షలతో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యశోద దవాఖాన యాజమాన్యం గ్రామంలోని 2వేల మందికి రూ.10వేల విలువగల వైద్యాన్ని ఉచితం గా అందించగా.. గ్రామంలోని ప్రతి వ్యక్తికి సం బంధించి హెల్త్‌ ప్రొఫైల్‌ సైతం సిద్ధమవుతున్నది. తాజా పర్యటనలో.. సీఎం కేసీఆర్‌ అధికారులకు చేసే దిశానిర్దేశంతో వాసాలమర్రి సమగ్రాభివృద్ధ్దికి బాటలు పడనున్నాయి. సీఎం పర్యటన స్థానికుల్లోనూ సంతోషాన్ని నింపుతున్నది.

- Advertisement -

గ్రామసభ కోసం స్థల పరిశీలన
వాసాలమర్రివాసులతో కలిసి సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేయనుండటంతోపాటు గ్రామాభివృద్ధ్దిపై స్థానికులతో గ్రామసభను నిర్వహించనుండటంతో పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పతి, వివిధ శాఖల జిల్లా అధికారులు శుక్రవారం వాసాలమర్రి గ్రా మంలో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భోజనం ఏర్పాట్లు చేసేందుకు భువనగిరి-గజ్వేల్‌ రహదారిలో ఉన్న పెట్రోల్‌బంక్‌ ఎదురుగా ఉన్న స్థలాన్ని, గ్రామ సభకోసం కొం డాపూర్‌కు వెళ్లేదారిలో హాస్టల్‌ పక్కనే ఉన్న స్థలా న్ని పరిశీలించారు. వర్షాకాలం కావడంతో సీఎం కేసీఆర్‌ పర్యటనకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు రెయిన్‌ఫ్రూఫ్‌ టెంట్లను ఏ ర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ గ్రామంలో అధికారులందరూ పర్యటించి పారిశుధ్య చర్యలను పర్యవేక్షించాలని, హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూ చించారు. సీఎం కేసీఆర్‌ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా అధికారులు గ్రామంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు. స్థల పరిశీలన చేసిన వారి లో డీఆర్‌డీవో, వాసాలమర్రి ప్రత్యేక అధికారి ఉపేందర్‌రెడ్డి, డీపీవో సాయిబాబా, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

హామీలను నెరవేర్చేందుకు..

వరంగల్‌ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ వాసాలమర్రివాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈనెల 22వ తేదీన గ్రామానికి రానున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. 22న ఉదయం 11గంటలకు ఊరికి వచ్చి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారని తెలిపారు. శుక్రవారం మండలంలోని వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్‌ గ్రామ సందర్శన నేపథ్యంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రమేలాసత్పతితో కలిసి గ్రామాన్ని సం దర్శించారు. అనంతరం గ్రామాభివృద్ధితోపా టు సీఎం కేసీఆర్‌ రాకకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 2020 అక్టోబర్‌31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవన ప్రారంభోత్సవానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి గ్రా మంలో కాసేపు ఆగి స్థానికులతో ముచ్చటించారన్నారు.

దత్తత తీసుకుంటానని ప్రకటించడ మేకాక వివిధ శాఖల అధికారులతో గ్రామ సమగ్రాభివృద్ధిపై ప్రణాళికలను సిద్ధం చేయిం చారని ఆమె తెలిపారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సీఎం పర్యటన వాయిదా పడిందన్నా రు. ఈనెల 22న గ్రామసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని గ్రామస్తులపై వరాలజల్లు కురిపించనున్నారు. అధికారులు ఇప్పటికే గ్రామ సమగ్రాభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై గ్రామంలో ఇంటింటా తిరిగి వివరాలను సేకరించి ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేశారన్నారు. గ్రామసభలో సీఎం కేసీఆర్‌కు ఆ రిపోర్టును అందజేస్తామన్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా గతంలో 270 మంది రైతులు వినూత్న పంటల సాగును పరిశీలించేందుకుగానూ నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ లో పర్యటించారన్నారు. వాసాలమర్రి గ్రామానికి సమీపంలోని చుట్టూ 10 గ్రామాలకు గ్రా మం నుంచి లింకురోడ్లను వేయనున్నారన్నా రు.

అదేవిధంగా గ్రామంలో వ్యవసాయ గోదా ములు, మల్టీపర్పస్‌ హాల్‌ నిర్మాణం, వెటర్నరీ సబ్‌స్టేషన్‌, విత్తనశుద్ధి ప్లాంట్‌, కోల్డ్‌ స్టోరేజీ , పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు 3311కేవి సబ్‌స్టేషన్‌ నిర్మాణాలు జరగనున్నాయన్నారు. అదేవిధంగా గ్రామంలో పార్క్‌, ఓపెన్‌ జిమ్ము, యువతకు లైబ్రరీ తదితర అన్ని వస్తువులు సమకూరనున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, డీపీవో సాయిబాబా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, ఎంపీపీ బూ క్యా సుశీలారవీందర్‌, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, రైతుబంధుసమితి మండల కన్వీనర్‌ నర్సింహులు, రహమత్‌షరీఫ్‌, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌గౌడ్‌, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇచ్చిన మాటకు కట్టుబడి
ఇచ్చిన మాటకు కట్టుబడి
ఇచ్చిన మాటకు కట్టుబడి

ట్రెండింగ్‌

Advertisement