e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home యాదాద్రి పచ్చదనంలో మోడల్‌ విలేజ్‌గా జలాల్‌పూర్‌

పచ్చదనంలో మోడల్‌ విలేజ్‌గా జలాల్‌పూర్‌

పచ్చదనంలో మోడల్‌ విలేజ్‌గా జలాల్‌పూర్‌

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 17: జలాల్‌పూర్‌ గ్రామాన్ని పచ్చదనంలో మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం జలాల్‌పూర్‌లో పల్లె బాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. అందుకే పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్య ఇవ్వడంతోపాటు వైకుంఠధామా లు, పల్లెప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 80 శాతం పైగా గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యంగా అంతర్గత మురుగునీటి కాల్వల ఏర్పాటుతోపాటు సీసీ రోడ్ల నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావొచ్చయన్నారు.

జలాల్‌పూర్‌ గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీఇచ్చారు. ఈ సం దర్భంగా గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న కస్తూర్బాగాంధీ బా లికల పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ. 3.5 లక్షలు కేటాయించగా ఆ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. గ్రామంలోని అన్ని వార్డులు తిరిగి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ పుష్పలతామల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ వెంకటేశం యాదవ్‌, సర్పంచ్‌ రజితి మల్లారెడ్డి, ఉపసర్పంచ్‌ బాల్‌రాజుగౌడ్‌, భూపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ బీమా చెక్కు అందజేత
ఎం.తుర్కపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రామచంద్రయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృ తి చెందాడు. మృతుడు టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం కలిగి ఉం డటంతో అతడికి మంజూరైన రూ. 2 లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గురువారం మండల కేంద్రంలో అతడి కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, తుర్కపల్లి వెంకట్‌రెడ్డి, పాండరి, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఇటీవల కొవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టు శానగొండ గిరిబాబు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మె ల్యే శేఖర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం గిరిబాబు కు టుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మల్లేపల్లి గ్రామంలో ఇటీవల కొవిడ్‌తో మృతి చెందిన ఇసాక్‌ కు టుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెం ట కవిత, రవీంద్ర, రత్నయ్య, లింగస్వామి ఉన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సీఎం సహాయనిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నా రు. అనాజీపురం గ్రామానికి చెందిన జూపల్లి రమణమ్మ సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.2లక్షల ఎల్‌వోసీ చెక్కును ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధ్దిదారుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు అశోక్‌, కృష్ణయ్య, సుమన్‌ పాల్గొన్నారు.

నిరుపేదలకు వరం..
సంస్థాన్‌ నారాయణపురం, జూన్‌17: పేదలకు సీఎం సహాయనిధి పథకం వరంగా మారిందని ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ భానుమతిగౌడ్‌ అన్నారు. సర్వే ల్‌ గ్రామానికి చెందిన యాదయ్యకు రూ.28వేలు, దయనందంకు రూ.48వేలు, భిక్షంకు రూ.38వేలు, చంద్రయ్య కు రూ.12వేలు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీ చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు . కార్యక్రమంలో సర్పంచ్‌ భిక్షపతి, ఎంపీటీసీ యాదయ్య, టీఆర్‌ఎస్వీ మునుగోడు అధ్యక్షుడు రమేశ్‌ పాల్గొన్నారు.

రామన్నపేటలో..
సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరమని ఇంద్రపాలనగరం సర్పంచ్‌ సిద్ధ్దమ్మాయాదయ్య అన్నారు. గురువారం గ్రామానికి చెందిన కిష్టయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.35వేల ఎల్‌వోసీ చెక్కును ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ గ్రామశాఖఅధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, కర్ణాకర్‌, విక్రం, వెంకటేశం, నర్సింగ్‌, సంజీవ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ
భువనగిరి మండలంలోని బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ఉడుత రవీందర్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.60వేల ఎల్‌వోసీ చెక్కును గురువారం గ్రామంలో భువనగిరి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శారదాఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రభాకర్‌, పాలసంఘం చైర్మన్‌ రాంరెడ్డి, వార్డు సభ్యులు పరమేశ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు నర్సింహ్మ, శ్రీశైలం, చంద్రం, బాబా, కొండల్‌, బాలరాజు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పచ్చదనంలో మోడల్‌ విలేజ్‌గా జలాల్‌పూర్‌
పచ్చదనంలో మోడల్‌ విలేజ్‌గా జలాల్‌పూర్‌
పచ్చదనంలో మోడల్‌ విలేజ్‌గా జలాల్‌పూర్‌

ట్రెండింగ్‌

Advertisement