e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home యాదాద్రి మనోధైర్యంతో కరోనాను జయించాలి

మనోధైర్యంతో కరోనాను జయించాలి

మనోధైర్యంతో కరోనాను జయించాలి


రామన్నపేట: మనోధైర్యంతో కరోనాను జయించాలని పల్లి వాడ గ్రామసర్పంచ్‌ కడమంచి సంధ్య అన్నారు. ఆదివారం మండలంలోని పల్లివాడ గ్రామంలో కరోనా బాధితులకు ని త్యావసర సరుకులు, గుడ్లు, కూరగాయలు, శానిటైజర్లు, మా స్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరో నా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు జనపాల చంద్రమ్మ, కల్లూరి రేణుక, నాంపల్లి ఉమారాణి, ఆశవర్కరు లక్ష్మి, మత్స్యగిరి, సైదులు, నర్సింహ్మ, పూలమ్మ, ఇస్తారమ్మ తదితరులు పాల్గొన్నారు.

పండ్లు, మజ్జిగ పంపిణీ
ఆలేరు టౌన్‌: రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో పేదలకు ఆలేరులో ఆదివారం శ్రీవాసవి సేవాసమితి జాతీ య ధార్మిక కమిటీ చైర్మన్‌ వంగపల్లి అంజయ్యస్వామి పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కుమార్‌, శ్రీనివాస్‌, రాజు, సత్యం తదిత రులు పాల్గొన్నారు.

కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ గడ్డం దశరథగౌడ్‌ అందజేసిన నిత్యావ సర సరుకులను ఆదివారం టీఆర్‌ఎస్‌ యువజనవిభాగం మం డలాధ్యక్షుడు బూడిద శేఖర్‌ కరోనా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. అదేవిధంగా తుక్కాపురంలో సర్పంచ్‌ దయ్యా ల రాజు దాతల సహకారంతో అందజేసిన కూరగాయలతో పాటు చికెన్‌ను కరోనా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1988-1989 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూ ర్వ విద్యార్థులు ఆదివారం ఎస్సీకాలనీలోని పేదలకు దుస్తులు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మతీన్‌, చంద్రశేఖర్‌, నగేశ్‌, భాస్కర్‌, యాదగిరి, సంతోష్‌, అనంతరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరోనా బాధితులకు అండ
బీబీనగర్‌: లాక్‌డౌన్‌ కారణంగా నాలుగు రోజులుగా బీబీనగర్‌ మండల వ్యాప్తంగా హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితు లకు సుధాకర్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత భోజ నం అందజేస్తున్నట్టు సంస్థ సభ్యుడు బొర్ర రమేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడి చి కిత్స పొందుతున్న వారికి తమ వంతు సాయంగా ఉచిత భోజ న సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ఉచిత భోజనం కోసం ఉదయం 7గంటల లోపు తమను ఫోన్‌ 9573723144 ద్వా రా సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

భోజన ప్యాకెట్లు పంపిణీ
భువనగిరి టౌన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని పేదల కు, యాచకులకు, ఇతర ప్రాంతాలకు వెళ్ల లేక రైల్వే, బస్‌ స్టేషన్ల లో ఉండిపోయిన 120 మందికి 17వ వార్డు కౌన్సిలర్‌ చెన్న స్వాతి ఆదివారం భోజన ప్యాకెట్లు, దుస్తులు అందజేశారు. కా ర్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌, రవి, పూర్ణ చం దర్‌, సుధారాణి, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాలు పంపిణీ
పట్టణంలోని 13వ వార్డులో కరోనా బాధితులకు స్థానిక నా యకులు గుర్రాల శ్రీనివాస్‌, యాట నాగరాజులు ఆదివారం నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమం లో స్థానికులు మురళి, వెంకటేశ్‌, బబ్బూరి నరేశ్‌గౌడ్‌, బర్రె నరేశ్‌, గుర్రాల శివ, నిమ్మల శివాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
మోటకొండూర్‌, మే 16: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభు త్వం విధించిన నిబంధనలను గ్రామ ప్రజలంతా పాటించాలని మేడికుంటపల్లి గ్రామ సర్పంచ్‌ పన్నాల బాయమ్మ కోరారు. కరోనాను అరికట్టేందుకు ఆదివారం గ్రామంలోని వీధుల్లో హై పోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించి, బ్లీచింగ్‌తో శానిటైజేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండ ల ప్రధాన కార్యదర్శి పన్నాల నవీన్‌రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వంగపల్లి, పెద్దకందుకూరుల్లో
యాదగిరిగుట్ట రూరల్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నేపథ్యం లో యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, పెద్దకందుకూరు గ్రా మాల్లో ఆదివారం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించారు. కరోనా క ట్టడి కోసం గ్రామంలో ఇంటింటికీ స్ప్రే చేయిస్తున్నట్లు సర్పంచ్‌లు కానుగు కవిత, బీమగాని రాములు గౌడ్‌, ఉపసర్పంచ్‌ రేపాక స్వామి తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమం లో వంగపల్లి కార్యదర్శి కిషోర్‌కుమార్‌రెడ్డి, పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బీబీనగర్‌: ప్రజలు కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని స ర్పం చ్‌ మంచాల రవికుమార్‌ అన్నారు. ఆదివారం మండలం లోని రహీంఖాన్‌గూడలో హైపోక్లోరైట్‌ పిచికారీ చేయించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మనోధైర్యంతో కరోనాను జయించాలి

ట్రెండింగ్‌

Advertisement