మహద్భుతం

63
మహద్భుతం
  • యాదాద్రి ఆలయ నిర్మాణానికి సీజేఐ కితాబు
  • యాదాద్రీశుడి సేవలో సీజేఐ ఎన్‌వీ రమణ దంపతులు
  • సీజేఐ దంపతులకు ఘన స్వాగతం పలికిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి
  • బాలాలయంలోపూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు

యాదాద్రి, జూన్‌15: సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గంలో యాదాద్రి కొండపై నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి చేరుకున్నారు. మంత్రులు, జిల్లా అధికారులు, ఆలయ అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన లిప్టు సాయంతో ప్రధానాలయంలోకి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా స్వామివారి బాలాలయంలోకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలాలయ ద్వారం వద్ద సీజేఐ దంపతులకు ఆల య ప్రధానార్చకులు, అధికారులు భాజాభజంత్రీలు, వేద మంత్రాలతో పూర్ణకుంభంతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివారి గర్భాలాయానికి వెళ్లిన సీజేఐ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బాలాలయంలోని ఉత్సవ మండపం వద్ద అర్చకులు వారి కి ఆశీర్వచనంచేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీత సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్ర్త్యాన్ని వివరించారు.

ప్రభుత్వాన్ని అభినందిస్తూ.. చరిత్రలో గుర్తుండిపోయేలా..
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం మహాద్భుతంగా చేపట్టిందని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ యాదాద్రిలోని సందర్శకుల పుస్తకం లో రాశారని ఆలయ ఈవో గీత తెలిపారు. మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న విధానాలను అభినందిస్తూ చరిత్రలో గుర్తుండిపోయేలా పుస్తకంలో రాశారన్నారు.

పునర్నిర్మాణ పనులను తిలకించిన జస్టిస్‌ రమణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను జస్టిస్‌ ఎన్‌వీ రమణ తిలకించారు. యాదాద్రీశుడికి పూజ లు నిర్వహించిన అనంతరం ఆయన నూతనంగా నిర్మిస్తున్న ప్రధానాలయం, మాఢవీధులు, ప్రధానాలయంలోని లోపలి భాగంలోని మండపాలు, సప్త రాజగోపురం, స్వామివారి నూతన గర్భాల యం, యాలీ పిల్లర్లను పరిశీలించారు. ఆలయ నిర్మాణ శైలీ, స్థపతులు నిర్మించిన తీరును సీజేఐ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా ఉత్తర, తూ ర్పుదిశలో చేపట్టిన ఆలయ నగరిని తిలకించారు. సుమారు 20 నిమిషాలపాటు ప్రధానాలయం చు ట్టూ కలియతిరిగి ఆలయ వైభవాన్ని వీక్షించారు. యాదాద్రి కళావైభవాన్ని ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా ఒకే రకమైన కృష్ణశిలలతో నిర్మించిన తీరు, యాదాద్రి కళావైభవాన్ని వైటీడీఏ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి ఆయనకు వివరించారు. అనంతరం లిప్టు ద్వారా కిందికి దిగి వీవీఐపీ అతిథిగృహంలో అల్పాహారం స్వీకరించారు. అనంతరం కొండ కింద అభివృద్ధి పనులను పరిశీలించారు.

టెంపుల్‌ సిటీ, గండిచెరువు,ప్రెసిడెన్షియల్‌ సూట్లను వీక్షించిన జస్టిస్‌
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండకింద నిర్మిస్తున్న టెంపుల్‌సిటీ, గండిచెరువు, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వీవీఐపీలకు నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్లను జస్టిస్‌ ఎన్‌వీ రమణ వీక్షించారు. గుట్ట చుట్టూ నిర్మిస్తున్న ఆరులైన్ల రోడ్లను పరిశీలిం చి, నేరుగా ప్రెసిడెన్షియల్‌ సూట్లను పరిశీలించా రు. గండిచెరువు పక్కనే నిర్మిస్తున్న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, అన్నదానం భవనాన్ని వీక్షించి నిర్మా ణ పనుల తీరును పరిశీలించారు. అదేవిధంగా స్వామివారి కొండకు పక్కనే 800 ఎకరాలలో వివిధ పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో నిర్మించిన టెంపుల్‌ సిటీపైకి జస్టిస్‌ ఎన్వీ రమణ వెళ్లారు. 10 నిమిషాలపాటు టెంపుల్‌సిటీని కలియతిరుగుతూ ఘాట్‌రోడ్లు, భక్తులు కాలినడక వచ్చేందు కు ప్రత్యేకమైన ఫుట్‌పాత్‌తోపాటు వైటీడీఏ కార్యా లయం, హెలీప్యాడ్‌, ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యం లో వసతి గృహాలు, డొనర్‌ కాటేజీల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం నేరుగా రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు.

సీజేఐకి ఘన స్వాగతం..
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవా రం తొలిసారిగా యాదాద్రికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఘనస్వాగతం లభించింది. యాదాద్రి కొండపై ఉన్న వీవీఐపీ అతిథిగృహం వద్దకు రాగా నే జస్టిస్‌ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛం, తులసి మొక్కను అందజేసి ఘన స్వాగ తం పలికారు. బాలాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జస్టిస్‌కు జనగామ జిల్లా పెంబర్తిలో ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని బహూకరించారు. కార్యక్రమంలో దేవాదా యశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌భగవ త్‌, కలెక్టర్‌ పమేలాసత్పతి, ఆలయ ఈవో గీత, చైర్మన్‌ నరసింహమూర్తి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగళ్‌ లక్ష్మీనరసింహచార్యులు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి, ఎస్‌ఈ వసంతనాయక్‌, వైటీడీఏ అధికారులు వెం కటేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఆలయ ఈఈ రామారావు, శ్రవణ్‌కుమార్‌, రమేశ్‌బాబు, యాదగిరిగుట్ట సీఐలు, అర్చకులు పాల్గొన్నారు.

ఊపిరి పీల్చుకున్న అధికారులు
సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ యాదాద్రి పర్యటన ప్ర శాంతంగా ముగిసింది. జస్టిస్‌ పర్యటన నేపథ్యం లో పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించారు. ఒక్కరోజు ముందే యాదాద్రి ఆలయంతోపాటు, గండిచెరువు, టెంపుల్‌ సిటీ, ప్రెసిడెన్షియల్‌ సూట్‌, యాదగిరిగుట్ట పట్టణాన్ని తమ అధీనంలో కి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రోడ్డు ప్రయాణం కావడంతో రోడ్లపై ఎలాంటి ఆటంకం కలుగకుండా పటిష్ఠ భద్రతను నిర్వహించారు. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదేశాలతో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. సుమా రు 3.15 గంటలపాటు యాదాద్రిలో గడిపిన సీజేఐ ప్రశాంతంగా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడంతో పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

సీజేఐను కలిసిన భువనగిరి న్యాయవాదులు
లక్ష్మీ నరసింహస్వా మిని దర్శించుకునేందుకు యాదాద్రికి వచ్చిన సీజే ఐను భువనగిరి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో న్యాయవాదులు విజ యభాస్కర్‌రెడ్డి, హరినాథ్‌గౌడ్‌, శ్రీహరి తదితరు లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సీజేఐ యాదాద్రి పర్యటన సాగిందిలా..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఉదయం 8.41 గంటలకు యాదాద్రికి చేరుకున్న సీజేఐ జస్టిస్‌ రమణ దంపతులు ఉదయం11.56గంటలకు తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.
ఉదయం 8.41 గంటలకు యాదాద్రికి చేరిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు
ఉదయం 8.44 గంటలకు యాదాద్రి కొండపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి,
ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతారెడ్డి ఘన స్వాగతం పలికారు
ఉదయం 9.09 గంటలకు బాలాలయంవద్ద పూర్ణకుంభంతో
స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ అధికారులు
ఉదయం9.10గంటలకు స్వామిని దర్శించుకున్న సీజేఐ దంపతులు
ఉదయం 9.23 గంటలకు దర్శనం పూర్తి
ఉదయం 9.25 నుంచి 9.36 వరకు ఆశీర్వచనం
ఉదయం 9.37 గంటలకు సీజేఐకి స్వామివారి చిత్రపటాన్ని
అందజేసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఉదయం 9.43 నుంచి 10.20 గంటల వరకు ఆలయ పరిశీలన
ఉదయం 10.22 నుంచి 11.05 గంటల వరకు అల్పాహారం
ఉదయం 11. 14 గంటలకు రింగురోడ్డు పనుల వీక్షణ
ఉదయం 11.17 గంటలకు ప్రెసిడెన్షియల్‌ సూట్ల పరిశీలన
n ఉదయం 11.40- 11.50 గంటల వరకు టెంపుల్‌ సిటీ పరిశీలన
n ఉదయం 11.56 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం