e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home యాదాద్రి నూతన కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

నూతన కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

నూతన కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి
  • ప్రాధాన్యత పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
  • అధికారులు స్థానికంగానే నివాసముండాలి
  • కలెక్టర్‌ పమేలా సత్పతి

భువనగిరి అర్బన్‌, జూన్‌ 15: నూతన కలెక్టరేట్‌ నిర్మాణ పను లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నా రు. పట్టణ పరిధిలోని నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనుల ను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారుల క్వాటర్స్‌తో పాటు కార్యాలయ భవన నిర్మాణాలను వారంలో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం జరిగిన పనుల నివేధికలను సమ ర్పించాలని ఆర్‌అండ్‌ ఈఈకి సూచించారు. కార్యాలయం ఆవ రణలో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దట్టమైన గ్రీనరీ ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా అటవీశాఖ అధికారులను ఆదే శించారు. నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని 54కోట్లతో 1, 20,000వేల చ.అ.విస్తీర్ణంలో చేపడుతున్నట్లు అధికారులు తెలి పారు. ఇప్పటికే మెయిన్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనులు పూర్తి కాగా తుది విడుత పేయింటింగ్‌ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. విద్యుత్‌ పనులు, ప్యాన్ల ఏర్పాటు,డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కిం గ్‌ టైల్స్‌ పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. భవనం లోని ఏబీసీడీ బ్లాకులు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీవో క్వాటర్స్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీవో అధికారులు ఉన్నారు.

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
భువనగిరి టౌన్‌: ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలను యుద్ధ ప్రాతిపదకపై పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి కోరారు. భువనగిరి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, హరిత హారం, డంపింగ్‌యార్డులు, స్మశానవాటికల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిందని ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. అధికారులంతా స్థానికంగానే నివాస ముండాలన్నారు. తద్వారా 50 శాతం మేర అభివృద్ధి పథకాల ను సకాలంలో పూర్తి చేయగలమని చెప్పారు. స్థానికంగా ఉండ ని అధికారులను ఎండమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నర్సరీలన్నింటిలోని మొక్కల న్నీ జెర్మినేషన్‌(అంకురోత్పత్తి)కి రావాలని, హరితహారానికి సి ద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తి చేసిన డంపింగ్‌ యార్డులను వినియోగంలోకి తేవాలన్నారు.

- Advertisement -

గ్రామ పంచాయతీ లు, పట్టణ ప్రాంతాల్లో పనికిరాని, పాడైన, నిరుపయోగంగా ఉన్న బోరు బావులు, ఓపెన్‌బోర్ల సంబంధికులకు నోటీసులు జారీ చేసి వారంలోగా పూడ్చి వేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల ఏర్పాటు కోసం ఇప్పటికే నిధులు విడుదలైనందున ప్రాధాన్యతనిచ్చి చేప ట్టాలన్నారు. వానకాలం అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామా లు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేయా లని, డ్రైనేజీలు శుభ్ర పరిచి మురుగునీరు ఎక్కడా ఆగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కురుస్తు న్న వర్షాలను సద్వినియోగ పరచుకుని హరితహారానికి సన్నద్ధం కావాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో పాడైన మొక్కల స్థానంలో పెద్ద మొక్కలను వెంటనే నాటాలని, నీరుపోసి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఖిమ్యానాయక్‌, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌కు ఘనస్వాగతం
బాధ్యతలు చేపట్టి మొదటి సారి భువనగిరి మున్సిపల్‌ కార్యాల యానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతికి భువనగిరి ము న్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు పూలమొక్కను అం దజేసి ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌, వార్డు సభ్యుడు పంగరెక్కల స్వామి తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతలు
భువనగిరి అర్బన్‌: కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న పమేలా సత్పతిని కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎంప్లా యూస్‌ యూనియన్‌ నాయకులు జేఏసీ చైర్మన్‌ మందడి ఉపేం దర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్ష లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు జగ న్‌, ప్రధానకార్యదర్శి ఖాధిర్‌, రెవెన్యూ ఎంప్లాయీస్‌ జిల్లా అధ్య క్షుడు భగత్‌, శ్యామ్‌సుందర్‌రెడ్డి, గెజిటెడ్‌ ఆఫీసర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, వెటర్నరీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, రెవెన్యూ ఎంప్లాయిస్‌ అసోసి యేషన్‌ జిల్లా కార్యదర్శి రవికుమార్‌, టీఎన్‌జీవోస్‌ ట్రెజరర్‌ శ్రీకాంత్‌, వెటర్నరీ ఫోరం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, మైనార్టీ ఎంప్లాయీస్‌ జిల్లా అధ్యక్షుడు ఇద్రీస్‌, అంగన్‌వాడీ టీచర్స్‌ అసో సియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నూతన కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి
నూతన కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి
నూతన కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

ట్రెండింగ్‌

Advertisement