e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు చీకటిమామిడిలో ప్రగతి వెలుగులు

చీకటిమామిడిలో ప్రగతి వెలుగులు

చీకటిమామిడిలో ప్రగతి వెలుగులు

పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
రూ.68లక్షల 99వేలతో అభివృద్ధి పనులు
ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటి సరఫరా
అన్నదాతలకు అందుబాటులో రైతు వేదిక
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం

బొమ్మలరామారం,మే15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా మండలం లోని చీకటిమామిడి గ్రామం సర్పంచ్‌ మచ్చ వసంత గౌడ్‌ ఆధ్వర్యంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ గ్రామ పంచాయతీలో 2629 మంది జనాభా ఉండగా 1295 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మె ల్యే గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి సహకారంతో హెచ్‌ ఎండీఎ నిధులు రూ.30లక్షలు, జీపీ నిధులు రూ.8 ల క్షలతో సీసీరోడ్లు నిర్మించారు. మూడు ట్యాంకులతో మి షన్‌ భగీరథ ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది రోజు తడి,పొడి చెత్త ను సేకరించి ట్రాక్టర్‌ ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలి స్తున్నారు. వాకింగ్‌ ట్రాక్‌తో పల్లెప్రకృతి వనంను ఏర్పా టు చేశారు. రైతు వేదిక నిర్మించి ప్రారంభించారు. అండ ర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. వైకుంఠధామం నిర్మాణం, డంపింగ్‌ యార్డ్‌ను ఏర్పాటు చేశారు.గ్రామం లోని విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ బల్బులు బిగించా రు. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా 9 పాత ఇండ్లను కూ ల్చివేశారు, రెండు పాత బావులు పూడ్చివేశారు.
రూ.68లక్షల 99వేలతో అభివృద్ధి పనులు
గ్రామానికి రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం రూ.68 లక్షల 99వేల నిధులు మంజూరు చేయగా రూ.19 లక్ష లతో వైకుంఠధామం, రూ.2 లక్షలతో కంపోస్ట్‌ యార్డ్‌, రూ.6లక్షలతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. రూ10లక్షల 58 వేలతో 156 ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. రూ.38 లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. రూ.9 లక్షల 77వేలతో ట్రాక్టర్‌ , ట్రా లీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు.రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేం దుకు ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. రోజూ ట్రాక్టర్‌ ద్వారా చెత్తను సేకరిస్తూ డంపింగ్‌ యార్డ్‌కు తర లించి ఎరువుగా మార్చుతున్నారు. వీధుల్లో చెత్త వేయ కుండా గ్రామస్తులకు అవగాహన కలిగించారు.

గ్రామంలో మార్పు కనిపిస్తుంది
పల్లె ప్రగతి ద్వారా గ్రామం అభివృద్ధి చెందింది. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామస్తులకు ఇబ్బందు లు లేకుండా తాగు నీరు అందజేస్తు న్నారు. పల్లె ప్రగతి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం కావడంతో గ్రామంలో మార్పు కనిపిస్తుంది.
– సిరిసినగండ్ల పాండు, గ్రామస్తుడు

పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
గ్రామంలో పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామస్తుల్లో పారిశు ధ్యంపై అవగాహన పెరిగింది. ప్రభు త్వం ప్రతి నెలా నిధులు సమకూర్చుతుండటంతో గ్రా మం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది.

  • రంగ రజిత, పంచాయతీ కార్యదర్శి, చీకటిమామిడి

ప్రజల సహకారంతోనే అభివృద్ధి
గ్రామస్తులు వార్డు సభ్యుల సహకారంతోనే అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సహకారంతో రూ.30లక్షల హెచ్‌ఎండీఏ నిధులతో సీసీ రోడ్లు నిర్మించాం.గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేక ప్రజల కోరిక మేరకు గ్రామ సమీపంలోని కొండను చదును చేసి రైతు వేదిక, డంపింగ్‌ యార్డ్‌ ని ర్మాణం పూర్తి చేశాం. వాకింగ్‌ ట్రాక్‌తో పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు చేశాం. కరోనా నిర్మూలన కోసం గ్రామంలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.కరోనా భాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. వారికి వైద్య సాయం అందేవిధంగా ఏర్పాట్లు చేశాం. – మచ్చ వసంత, సర్పంచ్‌, చీకటిమామిడి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చీకటిమామిడిలో ప్రగతి వెలుగులు

ట్రెండింగ్‌

Advertisement