e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home యాదాద్రి రెండో రోజూ.. సంపూర్ణం

రెండో రోజూ.. సంపూర్ణం

రెండో రోజూ.. సంపూర్ణం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : జిల్లాలో గురువారం లాక్‌డౌన్‌ రెండో రోజూ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భం గా వర్తక, వ్యాపారులు ఉదయం 6 గంటలకు తమ తమ షాపులను తెరిచి, 10 గంటల లోపే మూసివేశారు. ప్రజలు కూడా ఉదయం 10 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో వీధులు, అంతర్గత, ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
భువనగిరి టౌన్‌, మే 13 : కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గురువారం పట్టణంలో ప్రశాంతంగా జరిగింది.
యాదగిరిగుట్ట రూరల్‌, మే 13 : యాదగిరిగుట్ట మండలంలో లాక్‌డౌన్‌ గురువారం రెండో రోజు పక్కాగా అమ లైంది. యాదగిరిగుట్ట పోలీసులు అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు.
మోటకొండూర్‌, మే 13: మండలంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. లాక్‌డౌన్‌ ప్రక్రియను ఎస్‌ఐ నాగరాజు పర్యవేక్షించారు.
చౌటుప్పల్‌, మే 13 : లాక్‌డౌన్‌కు చౌటుప్పల్‌ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. చౌటుప్పల్‌ జాతీయ రహదారితోపాటు చౌటుప్పల్‌ సర్వీస్‌రోడ్లు ఉదయం 10 లోపు రద్దీగా కనిపించగా, 10 తర్వాత నిర్మానుష్యంగా మారా యి. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని, సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.
యాదాద్రి, మే13: యాదగిరిగుట్ట పట్టణంలో లాక్‌డౌన్‌ రెండో రోజూ సంపూర్ణంగా సాగింది. పోలీసులు ఉదయం నుంచే రంగంలోకి దిగారు. దీంతో యాదగిరిగుట్ట పట్టణ రోడ్లు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం బోసిపోయింది. యా దగిరిగుట్ట మండలంలో బుధవారం అర్ధరాత్రి వరకు 42 కేసులు నమోదు చేయగా గురువారం రోజున సాయం త్రం వరకు సుమారు 50 కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ జానకీరెడ్డి తెలిపారు.
వలిగొండ, మే 13: మండలంలో లాక్‌డౌన్‌ రెండో రోజు ప్రశాంతంగా కొసాగింది. పోలీసులు పెట్రోలింగ్‌ వాహనాలతో లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. నిత్యం వాహనాల తో రద్దీగా ఉండే భువనగిరి- నల్లగొండ ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు చెక్‌పోస్టు వద్ద రోడ్లపై వచ్చిన వాహనదారుల పత్రాలను పరిశీలించి కొవిడ్‌పై అవగాహన కల్పించారు.
ఆత్మకూరు(ఎం), మే13: మండలంలో లాక్‌డౌన్‌తో మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలు ఉదయం 11 గంటల నుంచి నిర్మానుష్యంగా మారాయి. ఎస్‌ఐ ఎండీ ఇద్రిస్‌ అలీతో పాటు పోలీసు సిబ్బంది మండల కేంద్రం లోని ప్రధాన రోడ్డు పై వాహనాలను తనిఖీ చేసి లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించని వారిని హెచ్చరించారు.
రామన్నపేట, మే13: మండలంలో లాక్‌ డౌన్‌ రెండోరోజూ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకే వ్యాపారులను షాపులను మూసేశారు. రామన్నపేట శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ ఐ చంద్రశేఖర్‌ వాహనాల తనిఖీలు నిర్వహించారు.
12 మందిపై కేసుల నమోదు
చౌటుప్పల్‌ రూరల్‌, మే13 : మండల పరిధిలో ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న 12 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ సీఐ ముని తెలిపారు.

ఇద్దరిపై కేసునమోదు
భువనగిరి అర్బన్‌, మే 13: లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ సైదులు తెలిపారు. హన్మాపురం గ్రామ సమీపంలో మహంకాళి దాబా నిర్వహిస్తున్న సుదగాని సంతోష్‌పై, పుష్పగార్డెన్‌లో నిర్వహించిన వివాహానికి 40 మందికి పైగా హాజరు కావడంతో పుష్ప గార్డెన్‌ నిర్వా హ కుడు మల్లేశ్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు
లాక్‌డౌన్‌ సడలింపులు ఉద యం 6నుంచి 10 గంటల వరకు ఉండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు గురువారం కొంతమేరకు అధికంగానే సాగాయి. చౌటుప్పల్‌ మండలపరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ నాలుగు గంటల్లో 5,200 వాహనాలు రాకపోకలు సాగించాయి. సాధారణ రోజుల్లో ఇదే సమయంలో సుమారు 3వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీ పెరిగినా ఫాస్టాగ్‌ విధా నం ఉండటంతో వాహనాలు టోల్‌ప్లాజా వద్ద బారులు తీరకుండా సాఫీగా వెళ్లాయి.

పోలీస్‌ చెక్‌పోస్టు తనిఖీ
అడ్డగూడూరు,మే 13: మండలంలోని చిర్రగూడూరు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును గురువారం సీఐ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెండో రోజూ.. సంపూర్ణం

ట్రెండింగ్‌

Advertisement