e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిల్లాలు పత్తి వైపే సాగు

పత్తి వైపే సాగు

పత్తి వైపే సాగు

తెల్ల బంగారం వైపు రైతన్న మొగ్గు
వరికి ప్రత్యామ్నాయంగా పత్తి
క్వింటాకు రూ. 6025 మద్దతు ధర
జిల్లాలో 1.95లక్షల ఎకరాల్లో సాగు

ఆలేరు టౌన్‌, జూన్‌13 : నేల, వాతావరణం, భౌగోళిక పరిస్థి తుల దృష్ట్యా వర్షాధార పంట అయిన తెల్ల బంగారంగా భావిం చే పత్తే లాభాలను ఇస్తున్నది. రైతులు దీన్నే ఎక్కువగా పండిస్తు న్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వరి తరువాత 1.95 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. పత్తి తరువాత కందికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌ 1నుంచి వానకాలం ప్రారంభమైంది. వర్షాలు ఆరంభమైన రోజు నుంచే పడుతున్నా యి. దీంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. అంతే కాకుం డా ఈ ఏడాది పత్తికి క్వింటాలు ధర రూ. 6025గా ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది కంటే రూ. 211 పెరిగింది. గత ఏ డాది అధిక వర్షాలతో పత్తి రైతులు కొంత ఇబ్బందులు ప డ్డారు. తేమ నిబంధనల కారణంగా మద్దతు ధర దక్కక , తెగు ళ్లు సోకడంతో కొంత మంది రైతులు నష్టపోయారు.

అయిన ప్పటికీ పత్తి క్వింటాలు రూ. 6వేల నుంచి 7వేలకు అమ్ముడు పోయింది. అయితే పత్తికి మద్దతు ధర పెరగడం రైతుకు ఊరట ఇచ్చే అంశం. జిల్లాలో అనేక చోట్ల వర్షాలు పడడంతో పత్తి విత్త నాలను నాటుతున్నారు. ఈ ఏడాది పత్తి అధికంగా పండే అవ కాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నా రు. మార్కెట్‌లో బీటీ-1, బీటీ-2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో బీటీ-2 రకాలు అమ్ముడవు తాయి. ప్రతి సీజన్‌లో విత్తనాలపై ఏటా రూ.కోట్ల వ్యాపారం జరుగుతున్నది. నకిలీ పత్తివిత్తనాలను నిరోధించేందుకు 17 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను జిల్లాలో ఏర్పాటు చేశారు.
పత్తి సాగుపై ఆసక్తి ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పత్తికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వరి, మొక్కజొన్న కంటే పత్తి మేలనే ఉ ద్దేశంతో పత్తినే సాగు చేస్తున్నారు. పత్తి విత్తనాల ధర అందుబా టులో ఉండడం, పత్తికి మద్దతు ధర అధికంగా లభించడం, వరికి మద్దతు ధర తక్కువగా ఉండడం, పెట్టుబడులు అధికం గా ఉండడంతో పత్తివైపు రైతులు ఆసక్తి చూపుతారు. పత్తి వాణి జ్య పంట కావడం, అధిక లాభాలను ఇస్తుందని రైతుల నమ్మ కం, మొక్కజొన్నకు పందుల బెడద అధికంగా ఉంటుంది. వాటిని నివారించడం కష్టంగా ఉంటుంది. పత్తికి మందులు తక్కువగా కొట్టే విధానం రావడం దీనిపై ఆసక్తి చూపుతున్నా రు. చివరికి పెట్టుబడులు అయినా వస్తాయని నమ్మకం. వరికి ధర లేకపోవడం, పెట్టుబడులు అధికంగా ఉండడంతో పాటు కూలీల కొరత, ఎరువులు, పురుగు మందుల ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -

తెలంగాణ పత్తి పంటకు అంతర్జాతీయంగా డిమాం డ్‌ ఉంది. మన దగ్గర పండే పత్తి పొడవు పింజ చాలా ఎక్కువ కాబట్టి దీనికి ఎక్కువగా డిమాండ్‌ ఉంది. దీంతో నాణ్యమైన దారం ఉత్పత్తి అవుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతు లను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పత్తి సాగుకు అనుకూల మైన వాతావరణం ఉంది. రైతులు సులువుగా అమ్ముకునేం దుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా దీంతో పాటుగా గత ఏడాది పత్తికి క్వింటా ధర రూ. 6 వేల నుంచి 7 వేల వరకు పలికింది. పెట్టుబడులు పోనూ పెద్త మొ త్తంలో లాభాలను ఆర్జించారు. గతంలో పత్తి విత్తనాలు కొ నాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క పత్తి విత్తనాల ధరలతో పాటుగా విత్తనాలు కూడా అందు బాటులో ఉన్నాయి.
దిగుబడులకు మార్గాలు
ఎలాంటి విత్తనాలు అయినా ఈ సాగు విధానాలతో అధిక దిగుబడులు సాధించవచ్చు. నల్లరేగడి భూముల్లో పత్తి పంట సాగు చేస్తేనే ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయి. నీటి వస తి ఉన్న ఎర్ర చెలుక నేలల్లో పత్తి పంట వేసినా డిసెంబర్‌ లోపే పంట తీసెయ్యవచ్చు. నైరుతి రుతు పవనాలతో వర్షాలు పడినా నిరవధికంగా 50 మిల్లీ మీటర్ల వర్షం ఒకేసారి కురిసిన తరువా తే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. అక్టోబర్‌, నవంబర్‌ సీజన్‌లో ఈశాన్య రుతుపవనాలు రాకుంటే నల్లరేగడిలో కొంత నష్టం వాటిల్లుతుంది. పత్తి గింజలను నాటే ముందు 30-40 గిం జలను నానబెట్టి వేసుకుంటే మొలక శాతం ఎలా వస్తుందో తె లుస్తుంది.

దీంతో రైతులు మోసపోరు. పత్తి విత్తే పొలంలో దు క్కిలోనే బాస్వరానికి సంబంధించిన ఎరువులను వేసుకోవాలి. ఎకరానికి 3బస్తాల సింగిల్‌ సూపర్‌ పాస్పెట్‌, అర బస్తా యూ రియా, అర బస్తా పొటాష్‌, ఎరువులను సేంద్రియ ఎరువులతో వేసుకుంటే మంచిది. పత్తి విత్తనాలను విత్తిన 48గంటల తరు వాత కలుపు నివారణకు పెండి మిథలిన్‌ మందును ఎకరాని కి లీటరున్నర చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బీటీ హైబ్రిడ్‌ పత్తి పొలం చుట్టూరా 2వరుసల్లో నాన్‌బీటీ గింజలు విత్తితే చీడలను తగ్గించవచ్చు. పత్తి విత్తనాలను విత్తినాక 20, 40,60 రోజులకు పత్తి మొక్క కాండం మీద మోనోక్రోటోపాస్‌ మందు ఒక శాతం, 4శాతం నీటిని చొప్పున కలిపి బొట్టు పెట్టే పద్ధతిలో పూయాలి. ఇదే ప్రకారం నత్రజని, పొటాష్‌ ఎరువు లను వేసుకోవాలి.
అధికారుల సూచనలు పాటించాలి
పత్తి సాగు చేసే రైతులు వ్యవసాయ శా ఖ అధికారుల సూచనలు పాటించాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు, గులా బీ రంగు పురుగు ఉధృతి నివారించేలా చర్యలు తీసుకోవాలి. పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడ పడి తే అక్కడ తక్కువ ధరకు లభ్యమవుతున్నాయని కొనొద్దు. ప త్తి పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సాగులో మెలకువలు పాటిస్తే అధిక దిగు బడులు పొందొచ్చు.
వెంకటేశ్వర్లు, ఏడీఏ, ఆలేరు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పత్తి వైపే సాగు
పత్తి వైపే సాగు
పత్తి వైపే సాగు

ట్రెండింగ్‌

Advertisement