e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు కొనసాగుతున్న సేవలు

కొనసాగుతున్న సేవలు

కొనసాగుతున్న సేవలు

రాజాపేట: మండల కేంద్రంలోని ఎమ్మార్పీ కార్యాలయ ఆవ రణలో ఆదివారం సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వర్కర్లు, ఎమ్మార్పీ ఉ ద్యోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా 40మందికి నెలకు సరిపడా బియ్యంతో పాటు వివిధ రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ట్రస్ట్‌ రాష్ట్ర ఇన్‌చార్జి రామ్మూర్తి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన స మావేశంలో ప్రధానోపాధ్యాయులు బూర్గు మహేందర్‌రెడ్డి మా ట్లాడుతూ అన్నపూర్ణ ట్రస్ట్‌ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బుస్సా రమేశ్‌గుప్తా, ఆనందరావు, శ్రీనివాస్‌, పరుశురాం, సాయి పాల్గొన్నారు.
మాస్కులు శానిటైజర్లు పంపిణీ
మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద ఆదివారం సీఎస్వీ గ్రూప్‌ అధినేత పుల్లూరి వెంకటేశంగుప్తా 500మాస్కులు, 100శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత జశ్వంత్‌, కెమిస్టు డ్రగ్గిస్ట్‌ ఈసీ మెంబర్‌ కృష్ణమూర్తిగుప్తా, ఆర్యవైశ్య సంఘం నేత నర్సింహులుగుప్తా పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
తుర్కపల్లి: మండల కేంద్రంలోని ఎమ్మార్పీ కార్యాలయం వద్ద ఆదివారం వివిధ గ్రామాలలోని పాఠశాలలో విద్యార్థులకు వం టలు చేసే 34మంది మహిళలకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమం లో ట్రస్ట్‌ సభ్యులు శ్రీనివాస్‌, రమేశ్‌, ఆనంద్‌ ఉన్నారు.
చేనేత కార్మికలకు అండగా ఉంటాం
మోత్కూరు: చేనేత కార్మికులకు పోపా అండగా ఉంటుందని పద్మశాలీ అఫీషియల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ (పో పా) జిల్లా అధ్యక్షుడు వనం శాంతికుమార్‌ భరోసా ఇచ్చారు. మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామంలో ఇటీవల కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి మృతి చెందిన నల్ల పరుశురాములు కు టుంబాన్ని ఆదివారం పోపా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరా మర్శించారు. ఈ సందర్భంగా క్వింటా బియ్యం, నిత్యావస రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెండెం నాగార్జున, చేనేత సంఘం నాయకులు గుంగుల రాములు, ప సునూరి యాదయ్య, చింతకింది చంద్రమౌళి, గుర్రం పురు షోత్తం, పసునూరి క్రిష్ణ, ఉప్పలయ్య, శోభన్‌, పాల్గొన్నారు.
పోలీసుల సేవలు అభినందనీయం..
బొమ్మలరామారం: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణం లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తి స్తున్న పోలీసులు సేవలు అభినందనీయమని టీఆర్‌ఎస్‌ మండ ల నాయకుడు వడ్లకొండ ఆనంద్‌చారి అన్నారు. ఆదివారం మండలంలోని పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలో ఎస్సై వెంకన్నకు, పోలీస్‌ సిబ్బందికి డ్రై ప్రూట్స్‌, మాస్కులు, శానిటైజర్లను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మైలారం సర్పంచ్‌ వడ్లకొండ అరుణ, మచ్చ సుదర్శన్‌గౌడ్‌, మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు బాబు, మచ్చ తిరు పతి, మాదిరెడ్డి కొండల్‌రెడ్డి, ఆరె కృష్ణ, రాజు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనసాగుతున్న సేవలు
కొనసాగుతున్న సేవలు
కొనసాగుతున్న సేవలు

ట్రెండింగ్‌

Advertisement