e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home యాదాద్రి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

భువనగిరి అర్బన్‌, జూలై12: ప్రణాళికతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పల్లెబాట కార్యక్రమం లో భాగంగా సోమవారం ఆయన మండలంలోని కూనూరు, జమ్మాపురం గ్రామాల్లోని వార్డుల్లో కలియతిరిగి స్థానికులను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, డంపింగ్‌ యార్డు, పల్లెప్రకృతివనం, వైకుంఠధామాల పనులు పూర్తి కావడంతో వాటిని ఎమ్మెల్యే ప్రారంభించా రు. కూనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని వార్డుల్లో అవసరమైన చోట సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల ఏర్పాటుకు కొలతలు వేయించి వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఆదేశించారు. కూనూరు గ్రామంలో అనాథలైన ముగ్గరు ఆడ పిల్లల ఉన్నత చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామశాఖ అధ్యక్షుడు మహేశ్‌ సహకారంతో అందజేసిన పుస్తకాలను చిన్నారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ కొలుపుల అమరేందర్‌, భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నల్లమాస రమేశ్‌గౌడ్‌, ఎంపీపీ నిర్మలావెంకటస్వామి, భువనగిరి పీఏసీఎస్‌ చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ బీరుమల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ మల్లయ్య, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, వైస్‌ ఎంపీపీ సంజీవరెడ్డి, చందుపట్ల మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధానకార్యదర్శి ఓంప్రకాశ్‌గౌడ్‌, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌గౌడ్‌, లక్ష్మీనారాయణగౌడ్‌, మోహన్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పవన్‌సతీశ్‌, ఈర్ల కృష్ణ, సత్యనారాయణ, మల్లికార్జున్‌ వీరేశ్‌యాదవ్‌, మహేశ్‌, మధు, ప్రవీణ్‌కుమార్‌, ఎంపీటీసీ లలితామల్లయ్య, కూనూరు సర్పంచ్‌ మురళీకృష్ణ, ఎంపీటీసీ శివనాథ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement