e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home యాదాద్రి అప్రమత్తతతోనే నివారణ

అప్రమత్తతతోనే నివారణ

అప్రమత్తతతోనే నివారణ
  • డీఈసీ, అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ
  • ఈ నెల 15,16,17 తేదీల్లో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
  • 7,74,562 మంది గుర్తింపు

ఆలేరు టౌన్‌, 12 జూలై : జిల్లాలో ఈనెల 15, 16, 17వ తేదీల్లో బోదకాలు, నులిపురుగుల వ్యాధి నివారణ కోసం మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వైద్యారోగ్య శాఖ ఏర్పాటు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి మాత్రలను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 7,74,562 మందికి మాత్రలు ఇవ్వాలని గుర్తించారు. ఇందుకు గాను 20,78,218 మాత్రలను సరఫరా చేశారు. కరోనా అధికంగా ఉండటంతో పాఠశాలలకు విద్యార్థులు రావడంలేదు. దీంతో కరోనా నిబంధనలను పాటిస్తూ ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, వైద్య సిబ్బంది, సామాజిక కార్యకర్తల సహకారంతో ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో బోదకాలు వ్యాధిగ్రస్తులు 1,733 మంది ఉన్నారు. మాత్రల పంపిణీకి 3,325 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు చొప్పున ఉంటారు.

నులిపురుగులతో

- Advertisement -

నులి పురుగుల కారణంగా రక్తహీనత, దగ్గు, శరీరంపై దురదలు వంటి సమ స్యలు ఎదురవుతాయి. పిల్లలు మట్టి లో ఆడుకోవడం, చెప్పులు లేకుండా మల విసర్జనకు వెళ్లడం, కలుషితమైన ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరి శు భ్రత పాటించక పోవడం వంటి కారణాల తో నులిపురుగులు, ఏలిక పాములు, కొంకి పురుగులు ఇలా మూడు రకాలైన పురుగులు సతాయిస్తుంటాయి. ఇవి పిల్లల జీర్ణకోశ వ్యవస్థలో చేరి రక్తహీనత, పోషకాహార లోపం, చురుకు దనం తగ్గడం, అంతర్గత రక్తస్రావం, నిద్రలేక పోవడం, ఆకలి మందగించడం, శారీరక పెరుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది ఆడ పిన్‌వర్మ్‌.. మల ద్వారం వద్దకు పాకి రోజుకు 15వేల చొప్పున గుడ్లు పెడుతుంది. మలం ద్వారా బయటకు వచ్చి చేరి ధూళి ద్వారా గుడ్లు గాలిలోకి వచ్చిన తరువాత రెండు రోజుల వరకు సజీవంగా ఉంటాయి. ఇవి తెల్ల రంగులో ఉండి..అర అంగుళం పొడవు ఉంటుంది. మల, యోని ద్వారం వద్ద దురద, జీర్ణాశయ వ్యవస్థలో ఇబ్బందులు, నిద్రలేమి, చికాకు తదితర లక్షణాలుం టా యి.

అలాగే కొంకి పురుగులు కూడా ఇవి శరీరంలోకి చొచ్చుకునిపోతాయి. శరీరంలో పెరిగిన తరు వాత శక్తి హీనులుగా మారుస్తాయి. నోటి దంతాల ద్వారా పేగులకు రంధ్రం చేసి రక్తాన్ని పీలుస్తాయి. పేగుల్లో నివసించే పరాన్న జీవులు, నోటి ద్వారానే కాకుండా చర్మం ద్వారా సంక్రమిస్తాయి. రక్తహీనత, పొడిచర్మం, పొడివెంట్రుకలు, కడుపునొప్పి, ఆకలిమంట, మట్టి తినాలనే కోరిక, వాపు, కడుపు ఉబ్బడం, ఆలస్యంగా రజస్వల కావడం, చురుకుదనం తగ్గడం, గుండె ఆగి చనిపోవడం వంటి లక్ష ణాలు ఉంటాయి. ఏలికపాములు కూడా వానపాములను పోలి ఉంటాయి. రోజుకు 2 లక్షల గుడ్లు పెడుతాయి. పేగుల్లో అండగా నిలుస్తాయి. ఆకలి మందగించడం, పోషకాహారం వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపునొప్పి, శరీరంపై దుద్దుర్లు, నిద్రలేమి, విరేచనాలు, లేదా వేళకు.. వీరేచనం కాకపోవడం, వాంతి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి.

బోదకాలు వ్యాప్తి ఇలా
క్యూలెక్స్‌ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. పరాన్నజీవి సంక్రమించిన వారిలో రక్తంలో ఉన్న మైక్రో ఫైలేరియా పరాన్నజీవి వ్యక్తికి కుట్టిన క్యూలెక్స్‌ దోమలో ఉండిపోతుంది. క్యూలెక్స్‌ దోమ కుట్టిన వ్యక్తి నుంచి మరొకరికి కుట్టడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. బోద వ్యాధి పరాన్నజీవి వల్ల కలిగే వ్యాధి. సాధారణం గా దీన్ని ఫైలేరియాగా పిలుస్తారు. దారం వంటి ఫైలేరియల్‌ (పురుగుల) ద్వారా కలుగుతుంది. ఈ పురుగులు లింప్‌ గ్రంథుల్లో స్థిరపడిపోయి మిలియన్ల సంఖ్యలో సూక్ష్మ ఫైలేరియాలను ఉత్పత్తి చేస్తాయి. దీన్నే మైక్రో ఫైలేరియా అంటారు. తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించకపోవడం వల్ల వ్యాధి ఉన్న వ్యక్తులకు తొలిదశలో గుర్తించలేము. కానీ వారి ద్వారా సముదాయంలో పరాన్నజీవి వ్యాప్తి చెందుతూనే ఉం టుంది. ఈ వ్యాధి వస్తే కాళ్లు, చేతులు లావెక్కి ఇబ్బంది పడుతారు. వ్యాధి సోకిన భాగమంతా నరాలు లాగుతూ జీవితంపై విరక్తి చెందుతారు. నెలలో 15 రోజుల పాటు జ్వరంతో బాధపడుతారు. మానసికంగా కుంగిపోతారు.

అవగాహన కల్పిస్తున్నాం

నులిపురుగులు, బోద కాలు వ్యాధి నివారణ కోసం అవగాహన కల్పిస్తున్నాం. ఈ వ్యాధుల నివారణకు మాత్రలు పంపిణీ చేస్తు న్నాం. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మాత్ర లు వేసుకున్న వారికి అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే చికిత్స అందించేందుకు ర్యాపిడ్‌ యాక్షన్‌ టీం కూడా అందుబాటులో ఉంది. నులిపురుగుల నివారణకు పరిశుభ్రత పాటించాలి. భోజనానికి ముందు చేతులను శుభ్ర పర్చుకోవాలి. బోదకాలు నివారణకు దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. క్యులెక్స్‌ దోమలు ఇంటి చుట్టూ మురుగు గుంతల్లో, సెప్టిక్‌ ట్యాంకుల్లో పెరుగుతాయి.
– డా. చింతకింది శ్రవణ్‌కుమార్‌, శారాజీపేట, పీహెచ్‌సీ వైద్యాధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అప్రమత్తతతోనే నివారణ
అప్రమత్తతతోనే నివారణ
అప్రమత్తతతోనే నివారణ

ట్రెండింగ్‌

Advertisement